*ధర్నా ప్రెస్ నోట్ (జివిఎంసి)*
*పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్ జరిపి భద్రతా చర్యలు చేపట్టండి*
*సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగరావు*
ప్రైవేట్ పరిశ్రమల్లో సేప్టీ ఆడిట్ జరిపి భద్రతా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్.నరసింగరావు డిమాండ్ చేసారు.
పరిశ్రమల్లో తరుచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ నిరసనలో సి.హెచ్.నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగిన ఘోరదుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయవిచారణ జరిపించాలన్నారు. ఎల్జిపాలిమర్స్ ప్రమాదం జరిగిన తరువాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. పరిశ్రమల్లోకి వెళ్ళిన కార్మికుడు తిరిగి సేప్టీగా తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదన్నారు. భద్రతా చర్యలు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయన్నారు. కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. కార్మికుల ప్రాణాలు కాపాడటానికి, భద్రతా చర్యలు చేపట్టడానికి యాజమాన్యాలు, ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు. అందువల్ల నష్టపరిహారం ఎంతోకొంత ప్రకటిస్తే సరిపోతుందని అనుకోవడం సరైందికాదు. ఎంత డబ్బులిచ్చినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు. పనిలో భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రాధిమికమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. సేప్టీ ఆడిట్ జరపడంలేదు. పైపులైన్లు లీక్ అయితే చర్యలు ఉండటం లేదు. ఫార్మా కంపెనీల్లో లాభాలు సంపాదించుకొని ధనవంతులుగా మారుతున్నారు తప్ప కార్మికులకు భద్రత కల్పించడం లేదన్నారు. యాజమానులపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోకుండా వారికి అండగా నిలవడం సరైంది కాదు. ఘటన జరిగి 40 గంటలు కావస్తున్నా యాజమాన్యాన్ని అరెస్టు చేయకుండా ఎందుకు రక్షిస్తున్నారని ప్రశ్నించారు. ఫార్మా, ఎస్ఇజెడ్ కంపెనీలకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్నా ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు. ఎల్జి ఘటన నుండి ఈ ప్రభుత్వాలు పాఠాలు నేర్చుకోలేదు. చంద్రబాబునాయుడు 2019లో జివో తెచ్చారు. ఫార్మా, ఎస్.ఇ.జెడ్లలో ఎటువంటి తనిఖీలు జరపకూడదని పొందుపర్చారు. అంటే యజమానులకు అనుకూలంగానే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భూగర్భజలాలను కలుషితం చేసి మరోవైపు ప్రజల ప్రాణాలు తీస్తున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. తక్షణమే అన్ని పరిశ్రమలపై ఆడిట్ జరిపి, భద్రత చర్యలు లేని యజమానులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఐటియు డిమాండ్ చేస్తుందన్నారు. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలుండాలి లేదంటే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, నాయకులు ఎం.సుబ్బారావు, వై.రాజు, యు.రాజు, టి.నూకరాజు, కె.చంద్రశేఖర్, పి.వెంకటరావు, జి.పోలేశ్వరరావు, ఎం.సూరీడు, ఈశ్వరరావు, కుమారి, ఓ.అప్పారావు, జి.అప్పలరాజు, కె.ఎం.కుమార్మంగళం, చంద్రమౌళి, నాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఆర్.కె.ఎస్.వి.కుమార్
ప్రధాన కార్యదర్శి
పరిశ్రమలలో సేఫ్టీ ఆడిట్ జరిపి భద్రతా చర్యలు చేపట్టండి CITU నాయకులు చెప్పారు
50
previous post