మహిళా భద్రతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయాలి
సీతమ్మధార వీధుల్లో కొవ్వుత్తుల ర్యాలీ
విశాఖపట్నం : కలకత్తా ట్రైనీ డాక్టర్ పై జరిగిన హత్యాచారానికి వ్యతిరేకంగా విశాఖ సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి సీతమ్మధార వీధుల్లో కొవ్వుత్తుల ర్యాలీ నిర్వహించారు. మా సంస్కృతి సంస్థ అధ్యక్షురాలు, టీడీపీ నాయుకురాలు దువ్వాడ లక్ష్మి భార్గవి ఆధ్వర్యంలో ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా లక్ష్మి భార్గవి, ఏయూ విశ్రాంతి ఆచార్యులు ఎస్ రామకృష్ణరావు, ప్రొఫెసర్ శాంతా రామ్ మాట్లాడారు వైద్యురాలిపై లైంగిక దాడి చేసి హతమార్చడం దారుణమన్నారు, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మహిళా భద్రతకు దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు చేయాలని డిమాండ్ చేసారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో మరొకరు ఇటువంటి దారుణానికి పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దేశంలో స్త్రీలు, చిన్నారుల పట్ల అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలన్నారు. త్వరగా శిక్షించడం వలన ఇటువంటి ఘటనలు పునరావృతం కావన్నారు. మహిళలను గౌరవించే విధంగా నడవడికలు నేర్పించాలన్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా క్రూరంగా మహిళా డాక్టర్‌పై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేయడం ఆటవిక సమాజాన్ని గుర్తుచేస్తోందన్నారు.వైద్యులు, వైద్య విద్యార్థులు, మహిళలు, చిన్నారులకు భ ద్రత లేకుండాపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై,చిన్నారులపై ,వైద్యులపై జరిగే దాడులను అరికట్టేందుకు అన్ని స్థాయిల్లోనూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దోషులను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం లో సురేష్ బాబు, మురళీకృష్ణ
సంజీవ్, ఉషా, వరలక్ష్మి
తదితరులు పాల్గొన్నారు