సెప్టెంబర్ 2 నుంచి “డిప్యూటీ సిఎం క్రికెట్ టోర్నమెంట్”
*దక్షిణ ఎమ్మేల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ పోస్టర్ విడుదల
*వంశీ యువసేన నేత విద్యాసాగర్ టోర్నమెంట్ వివరాలు వెల్లడి
సీతమ్మ పేట (విశాఖ ఉత్తర):
జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భముగా నిర్వహించే
“డిప్యూటీ సీఎం టి – 10 క్రికెట్ పోటీలు” విజయవంతం చేయాలని విశాఖ దక్షిణ నియోజక వర్గం శాసనసభ్యులు, విశాఖ జిల్లా జన సేన పార్టీ అధ్యక్షుడు వంశీ కృష్ణ శ్రీనివాస్ కోరారు. రామటాకీస్ రెడ్డి హాస్పిటల్ డౌన్ పోస్ట్ ఆఫీస్ వెనుక రాజేంద్ర నగర్ లో గల జనసేన నగర పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన కార్యక్రమంలో క్రికెట్ టోర్నమెంట్ పోటీల గోడ పత్రిక విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పోటీల నిర్వాహకులనుఅభినందించారు.
సెప్టెంబర్ రెండో తేదీనుంచి ఈ పోటీలు
జరుగుతాయని వంశీ యువసేన నేత, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పీ. విద్యా సాగర్ వెల్లడించారు. జీ వీఎంసీ పరిధి 98 వార్డుల నుంచి 98 జట్లు పాల్గొనవచ్చు నన్నారు. ఒక్కో టీమ్ లో 14 మండి క్రీడాకారులు వుంటారని తెలిపారు. మొత్తం 23 రోజుల పాటు విశాఖ దక్షిణ నియోజకవర్గం వన్ టౌన్ వెలమపేట
జీవీఎంసీ ఇందిరా గాంధీ స్టేడియంలో
ఈ టోర్నమెంట్ జరుగుతుందన్నారు. పోటీలలో విజేతలకు ప్రధమ బహుమతి 50 వేల రూపాయలు,ద్వితీయ బహుమతి కింద 30 వేలు, తృతీయ బహుమతి కింద 10 వేలు వంతున నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామన్నారు. తెలుపు రంగు
టీషర్ట్, లోయర్ బ్లూ, లేదా నలుపు ట్రాక్ ఫ్యాంట్ డ్రెస్ కోడ్ నిర్ణయించామన్నారు.
ఈ నెల 28 వ తేదీ లోగా ఆసక్తి గల జట్లు ఎంట్రీలు పంపుకోవాలని కోరారు.
సీతమ్మపేట రాజేంద్రనగర్ లో గల
జనసేన పార్టీ కార్యాలయంలో ఎంట్రీలు అందజేయాలని కోరారు. పూర్తి వివరాలు కోసం 91822 50409, 98488 29197 ఫోన్ నెంబర్లు లో సంప్రదించాలన్నారు.
ఎంట్రీ ఫీజు గా వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు. తాను వైజాగ్ క్రికెట్ అసోసియేషన్ సభ్యునిగా వున్నానని తెలిపారు. రోజుకి ఐదు మ్యాచులు నాకౌట్ విధానంలో జరుగుతాయన్నారు. విశాఖ దక్షిణ నియోజక వర్గ ఎమ్మేల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయన్నారు. ముగింపు వేడుకలు కూడా వేదిక వద్దనే జరుగుతాయని తెలిపారు. విజేతలకు ముగింపు వేడుకలలో బహుమతులు అందజేస్తామన్నారు.ఆర్గనైజింగ్ సెక్రటరీలు సందల రవి కుమార్, ఎల్లాజీ యాదవ్, మొకర గోపి తదితరులు టోర్నమెంట్ ఏర్పాట్లు పర్యవేక్షిస్తారన్నారు. మీడియా సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు మొకర గోపి, సందల రవి కుమార్, జన సేన వీర మహిళలు 31 వార్డు అధ్యక్షురాలు కొల్లూరు రూప, టి వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.