వృక్షాబంధన్ మహోత్సవం ఆనందదాయకం
– ప్రతి ఒక్కరూ పెద్ద వృక్షాలకు రాఖీలు కట్టి కాపాడండి
– జి మంగమ్మ. డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. విశాఖ జంతు ప్రదర్శనశాల
వృక్షాబంధన్ మహోత్సవం ఆనందదాయకం అని డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జి మంగమ్మ అన్నారు . ఆదివారం ఉదయం విశాఖపట్నం లోని ఇందిరా గాంధీ జులాజికల్ పార్క్ లో అతిపెద్ద మర్రిచెట్టు కు రాఖీ కట్టిన తరువాత మాట్లాడారు. అతిపెద్ద వృక్షాలకు రాఖీ లు కట్టడం ద్వారా వాటిని రేపటి తరాలకు వారసత్వ సంపద గా గుర్తించి కాపాడుకోవాలి అని కోరారు. అలా ప్రతి ఒక్కరినీ చైతన్య పరచడానికి తాము గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ తో కలిసి వృక్షాబందన్ దినోత్సవం నిర్వహించామన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం మాట్లాడుతూ 2008వ సంవత్సరం నుండి విశాఖపట్నం లో 100 సంవత్సరాల పైబడిన చెట్లకు రాఖీ కట్టడం మొదలు పెట్టాం అన్నారు. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విద్యా సంస్థలకు విస్తృతంగా ప్రచారం
నిర్వహించామన్నారు. అది ఫలించి ఈ ఏడాది 5 రాష్ట్రాల్లో వృక్షాబందన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారని, మొత్తం దేశ వ్యాప్తంగా పది వేలకు పైగా ప్రాంతాల్లో ఈ వృక్షాబందన్ మహోత్సవం నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ జిల్లా కొఆర్డినేటర్ ఎస్ బాబూరావు,అసిస్టెంట్ క్యూరేటర్ గోపాల్ నాయుడు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లుజి భారతి, రాజేష్ ,జ్యూ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ దివ్య, సిఫా ట్రస్ట్ ప్రతినిధి ప్రసాదరావు,గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి వాలంటీర్లు జె. రవితేజ, ఐ. కృష్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.