దేశ స్వతంత్రం వచ్చి 77 పూర్తి కావచ్చు 78 లో అడుగుపెడుతున్న మహిళలకు రక్షణ లేదని వామపక్షాల నాయకులు

by vvwnews.com

విశాఖ :
దేశ స్వాతంత్రాన్ని, రాజ్యాంగాన్ని వ్యతిరేకించినవారు నేడు కేంద్రంలో అధికారంలో ఉన్నారని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి విమర్శించారు. విశాఖలోని అల్లిపురం లో ఉన్న సిపిఐ కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటానికి వ్యతిరేకంగా యువతను ఉద్యమంలో పాల్గొనవద్దని ఆనాడు చెప్పినవారి చిత్రపటాలను ఈనాడు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఉంచారని ఇది దేశానికి పట్టిన దురదృష్టకర సంఘటన అని విమర్శించారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు భారతం గురించి స్వాతంత్ర ఉద్యమకారులు కన్న కలలను నేటితరం యువతకు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశానికి స్వాతంత్ర వచ్చి 77 సంవత్సరాలు గడిచినప్పటికి మహిళలు నిర్భయంగా తిరగలేని పరిస్థితి ఇంకా దేశంలో ఉండడం తీవ్రంగా పరిగనించాలని ఇటీవల పశ్చిమబెంగాల్లో మేడికో హత్యాచారం ఘటన అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎం పైడిరాజు కార్యవర్గ సభ్యులు ఎ విమల, కసిరెడ్డి సత్యనారాయణ, జి ఎస్ జె అత్యతరావు తదితరులతో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles