స్వాతంత్ర దినోత్సవ విశాఖ కళాకారుడు మోకా విజయ్ కుమార్ 200 పైగా మిల్లెట్స్ తో చిత్రాలు తయారు చేశారు.

by vvwnews.com

స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ ఒక ప్రత్యేకమైన బహుమతిని సిద్ధం చేశారు. మిల్లెట్స్ ను ఉపయోగించి భారతదేశ చిత్రపటాన్ని, స్వతంత్ర పోరాట యోధుల చిత్రాలను ఎంతో సహజ సిద్ధంగా మలిచారు. దాదాపు నెల రోజుల శ్రమించి ఐదు అడుగుల పొడవైన ఈ చిత్రాన్ని ఎన్నో వ్యయప్రయాలకు ఓర్చి తయారు చేశారు. యువతలో దేశభక్తిని స్వాతంత్ర పోరాట స్ఫూర్తిని తెలియజేసే విధంగా ఈ చిత్రాన్ని సిద్ధం చేసినట్లు విజయకుమార్ తెలిపారు. కళ్ళకు ఒక సామాజిక సందేశాన్ని జోడిస్తూ నిరంతరం విజయ్ కుమార్ ఇటువంటి చిత్రాలను తీర్చిదిద్దడం జరుగుతోంది. గత ఏడాది కాలంలో 200 పైగా మిల్లెట్స్ తో విభిన్న సందర్భాలకు అనుగుణంగా చిత్రాలను తయారు చేశారు.

Use Social Media to Spread the Word about Our News

related articles