53
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ బ్యాంక్ ఆఫ్ బరోడా వడ్లపూడి బ్రాంచ్లో బుధవారం పాము కలకలం సృష్టించింది. బ్యాంకు రికార్డు రూములో పాము చొరబడింది. బ్యాంకు సిబ్బంది పామును చూసి హడలిపోయారు. స్నేక్ క్యాచర్ కిరణ్ కు బ్యాంకు సిబ్బంది సమాచారం అందించడంతో అతను వచ్చి పామును పట్టుకున్నాడు. అనంతరం ఊరికి దూరంగా వదిలి వేశాడు. పాములు చూస్తే భయపడకుండా సమాచారం ఇవ్వాలని పేర్కొన్నారు.