డి .ఎల్ .రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అద్వర్యం లో నిరుపేదలకు బిర్యానీ ను ధర్మాల ఫౌండేషన్స్ అధ్యక్షులు ధర్మాల ఆనంద్ కుమార్ రెడ్డి పంపిణీ చేశారు .సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వాహణ తోనే సంతృప్తి సాధ్యపడుతుందని డి .ఎల్ .రెడ్డి వర్ధంతి సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆనంద్ కుమార్ రెడ్డి అన్నారు .కార్మిక నాయకుడిగా కార్మిక రంగం లో ముఖ్యంగా రక్షణ రంగం లో విశేష సేవలు అంధించారన్నారు .సేవా కార్యక్రమాలు నిర్వాహణ లో భాగంగా పేదలకు అన్నదానం విద్యార్థుల కు స్కాలర్ షిప్ లు తో పాటు ఉచితంగా పుస్తకాలు పంపిణీ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నామన్నారు .నగరం లో ఈ రోజు కప్పరాడ , తాటిచెట్లపాలెం రైల్వేన్యూకానీ అక్కయ్యపాలెం ద్వారకానగర్ దొండపర్తి , రైల్వేస్టేషన్ ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలలో నిరుపేదలకు బిర్యానీ అందచేశారు అనంతరం కప్పరాడ సాయిబాబా గుడి వద్ద అన్నదానం నిర్వహించారు
సీతమ్మధార పాపా హోమ్ లో అన్నదానం చేశారు .కార్యక్రమం లో ట్రస్ట్ ప్రతినిధులు కృష్ణకాంత్ రెడ్డి , జానకిరామ్,జై కుమార్,ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డి ఎల్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు భోజనం అందించారు
53