స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి AITUC డిమాండ్.

by vvwnews.com

*ప్రచురణార్థం*

*స్టీల్ ప్లాంట్,ప్రవేటికరణ రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి*
*ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ*

స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటికరణను నిలిపివేయాలని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కార్మిక ప్రజాసంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న నిరవధిక నిరసన దీక్ష శిబిరం శనివారానికి 1225 వ రోజుకి చేరుకున్నది. ఈ సందర్భంగా పడాల రమణ మాట్లాడుతూగంగవరం పోర్టును ఆదానికి అప్పచెప్తూ జగన్ ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో టిడిపి జనసేన బిజెపి కూటమి ప్రభుత్వాలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను రద్దుచేస్తూ ప్రకటించాలని లేని డిమాండ్ చేశారు కార్మిక ఆగ్రహానికి తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు . స్టీల్ ప్లాంట్ కు క్యాప్టివ్ మైన్స్ ను కేటాయించాలని, అనేక వేల కోట్ల రూపాయలు డివిడెంట్ల రూపంలో అనేక సంవత్సరాలుగా పొందినటువంటి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులు చేయాలన్నారు. స్టీల్ ప్లాంట్ లో కార్మికులకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేకపోతున్నామనే పేరిట స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేరువేరు మోసపూరిత మార్గాలను అనుసరించడాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పక్షాన ఉన్నటువంటి అనేక మార్కెట్ యార్డ్ లను ఏ పరిస్థితిలో కూడా లీజు కి ఇవ్వడానికి గాని అమ్మడానికి గాని పూనుకోరాదని కోరారు. స్టీల్ ప్లాంట్ భూములను ప్రభుత్వరంగ లేదా ప్రైవేట్ రంగ పరిశ్రమలకు గాని కంపెనీలకు గాని అప్పజెప్పడానికి వీలులేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ మిగులు భూములను నిర్వాసితులకు అప్ప చెప్పాలి తప్ప, ఏ ప్రైవేటు సంస్థలకు గాని వ్యక్తులకు గాని అప్పజెప్పడానికి వీలులేదని డిమాండ్ చేశారు. నిర్వాసితులకు తక్షణమే ఉద్యోగాలు కల్పించాలని కోరారు. పోరాటాన్ని తీవ్రం చేయకపోతే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలు కూడా మోసపూరితంగా ఏదో ఒక రూపంలో ప్రవేటీకరణకు మార్గాలు వేసే అవకాశం ఉందని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏఐటియుసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీ వామనుమూర్తి . జిల్లా కార్యదర్శి కోటా సత్తిబాబు నాయకులు కే సత్యనారాయణ కే ఆనందు. ఎన్ మధు. ఎల్.వెంకటేష్ సత్తిరాజు
పి రమణ. నూకరాజు. బంగారు బాబు. ప్రొఫెసర్ సూరప్పుడు ప్రజా గాయకుడు మజ్జి దేవిశ్రీ పాల్గొని సంఘీభావం తెలిపారు

Use Social Media to Spread the Word about Our News

related articles