ఊరుకి మేలు చేసే *కమిటీ కుర్రాళ్ళు*
– ఆగస్టు 9న విడుదల
– నిర్మాత నీహారిక కొణిదెల
విశాఖ పట్నం:
*నిహారిక కొణిదెల* సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం *‘కమిటీ కుర్రోళ్ళు’* యూనిట్ శనివారం విశాఖలో సందడి చేసింది. ఈ సినిమాకు యదు వంశీ దర్శకుడు. ఆగస్ట్ 9న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం ఎంవిపి కాలనీ *గాది రాజు ప్యాలెస్* లో జరిగిన
ప్రెస్ మీట్ లో నిహారిక కొణిదల తో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. చిత్రం నిర్మాత నీహారిక కొణిదెల మాట్లాడుతూ, ఈ సినిమా ఈనెల 9 న విడుదల అవుతుంది అన్నారు. అనుదీప్ దేవ్ వీనుల విందుగా సంగీతం అందించారు అని ప్రశంసించారు. ఆర్ ఆర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చాయి అన్నారు. సాయి కుమార్ కీలక పాత్ర లో కనిపిస్తారు అన్నారు. ఇది 1990 దశకంలో కథాంశం అన్నారు. తాను కూడా 90 కిడ్ కావడంతో వంశీ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యాను అన్నారు. నాన్న, వాళ్ళు గోదావరి జిల్లా అయినా తాను పుట్టి పెరిగినది హైదరాబాద్ అన్నారు. నాన్న కథ విని బాగా కనెక్ట్ అయ్యారు అని సంతొషం వ్యక్తం చేశారు. గ్రామీణ జాతర బ్యాక్ డ్రాప్ తో కథ నడుస్తుంది అన్నారు. కథా నుసారం కొత్త నటీనటులను తీసుకున్నాం. ఇందులో ఐదుగురు అమ్మాయిలు, 11 మంది యువకులు వుంటారు అన్నారు. కులాలు రిజర్వేషన్లు కొంచెం టచ్ చేశాం అన్నారు. వ్యవస్థ ఎలా ఉంటుంది అన్నది ఈ సినిమాలో చూపించాం అన్నారు. పంచాయితీ ఎన్నికలలో రాజకీయాలు ఎలా వుంటాయి అన్నది చిత్రంలో చూపించాం అని పేర్కొన్నారు. ఇది భావోద్వేగాలు, డ్రామతో కూడిన చిత్రం అన్నారు. సినిమా టీజర్, ట్రైలర్ లకు ఇప్పటికే మంచి స్పందన వచ్చింది అన్నారు. విశాఖ తో తనకు మంచి అనుబంధం వుంది అన్నారు. తన తొలి సినిమా షూటింగ్ విశాఖలో జరిగింది అన్నారు. విశాఖ కు చెందిన ప్రసాద్, సందీప్, రుషిక తదితరులు ఇందులో నటించారు. అమలా పురం, గన్న వరం ప్రాంతాల్లో షూటింగ్ జరిగింది. ప్రతి మనిషి జీవితంలో జరిగే సంఘటనలు ఇందులో వుంటాయి. పెద్దోడు పాత్ర అందరినీ ఆకట్టుకునే విధంగా వుంటుంది. ఈ సినిమా పూర్తి కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా అన్నారు.
చిత్రం నటుడు
ప్రసాద్ మాట్లాడుతూ, తాను ఇందులో పెద్దోడు పాత్ర చేశాను అన్నారు. కామెడీ , ఏమోషన్స్ తో కూడిన చిత్రం అన్నారు.
కో ప్రొడ్యూసర్ ఫ ని
మాట్లాడుతూ,
ప్రతి ఊరు వాడలో ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. విశాఖలో ప్రమోషన్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు. మీడియా సమావేశంలో చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేష్, చిత్రం నటీనటులు పాల్గొన్నారు.