56
ఆరోగ్యశ్రీలో కూడా రూ. 1600 కోట్లు బకాయిలు పెట్టి జగన్ వెళ్లిపోయాడు. వైసీపీ పాలనలో ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో ఆరోగ్య శ్రీ సేవలు నిలిపేస్తూ ఎన్నో సార్లు ఆయా ఆసుపత్రుల యాజమాన్యాలు ధర్నాకు దిగాయి. దీంతో ఎంతో మంది పేదలకు ఆరోగ్యం అందలేదు. వైసీపీ నేతలు చేసిన ఆర్థిక అవకతవకల మూలంగా.. రాష్ట్రాన్ని ఆర్థికంగా కుదేలు చేయడం వలన ఆఖరికి భోజనాలు సరఫరా చేసే వారికి కూడా బిల్లులు ఇవ్వలేని దుస్థితి ఉంది. పత్రిక ఉందని గోబెల్స్ ప్రచారం, అబద్దాలు ప్రచారం చేయడం మాని అసెంబ్లీకి వచ్చి వైసీపీ నేతలు చేసిన మేలు ఏదైనా ఉంటే చెప్పుకోవాలి…