విశాఖ…..
మరోసారి మానవత్వం చాటుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టిడిపి అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు….
విశాఖ జిల్లా నాతయ్యపాలెం
వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. షీలా నగర్ నుండి గాజువాక వైపు వెళ్తున్న అతివేగంగా వెళ్తూ అడ్డువచ్చిన ద్విచక్రవాహనం అడ్డుగా రావడంతో ఒక్కసారిగా లారీ ఆపడంతో వెనుక వస్తున్న లారీ ఢీ కొట్టడంతో వెనుక లారీ క్యాబిన్ మొత్తం ధ్వంసం అయింది ,ఈ ప్రమాదంలో క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను గాజువాక నుండి విశాఖ వైపుగా వెళ్తున్న రాష్ట్ర టిడిపి అధ్యక్షులు , గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దగ్గరుండి ప్రమాదంలో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసేందుకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించేందుకు ప్రయత్నాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు దగ్గరుండి మానవత్వాన్ని చాటుకున్న నేపథ్యంలో స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.