మానవసేయే మాధవసేవ పరమావధిగా
పట్టా ఫౌండేషన్…..
ఉత్తరాంధ్ర విశిష్ట దైవం ,విశాఖపట్నం , సింహాచలం మహా పుణ్యక్షేత్రం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి ( సింహాద్రి అప్పన్న) ” గిరి ప్రదక్షిణ ” శ్రీలక్ష్మీనరసింహస్వామి కొండచుట్టు 32 కిలోమీటర్లు కాలు నడకన ప్రదక్షిణ చేసి పౌర్ణమి నాడు శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దర్శించడం ఉత్తరాంధ్ర భక్తజనులకు ప్రగాఢ విశ్వాసం నమ్మకం . గిరి ప్రదక్షిణ పురస్కరించుకొని సింహాద్రి అప్పన్న తొలి పావంచా నుండి గిరి ప్రదక్షిణకు ప్రారంభమైన లక్షలాదిమంది భక్తుజనులకు పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కైలాసగిరి మార్గమున విశాలాక్షి నగర్ నందు మానవసేవయే మాధవ సేవగా భక్తజనులకు
ఉదయం పులిహోర , చక్కెర పొంగలి మరియు
సాయంత్రం మిర్యాలపాలు , బిస్కెట్స్ , టాబ్లెట్స్
మరుసటి రోజు తెల్లవారి వరకు ఉచితంగా సేవలు అందించడం జరిగింది , ది సన్ మెడికల్స్ బొడ్డేడ సత్యనారాయణ , లక్ష్మీ కామాక్షి ఎంటర్ప్రైస్ మళ్ళ మాధవ్ కామాక్షి వారు , ఫారూస్ బ్యూటీ కేర్ సింగపూర్ మోటూరు ప్రకాష్ పార్వతి మరియు
జె ఏ సి l విశాఖ వ్యాలీ అధ్యక్షురాలు ఇంద్రజ సభ్యులు శివకుమార్ విశాఖపట్నం సంయుక్తంగా
సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఆధ్యాత్మిక సేవా మించిన మరొక సేవ లేదని, ఆధ్యాత్మిక సేవలో ఎంతో మానసిక తృప్తి ఆనందం
కలుగుతుందని , ప్రముఖ పర్వదినములు పురస్కరించుకొని అక్క ఫోన్ చేసింది సేవా కార్యక్రమాలు తరచుగా చేస్తున్నామని పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు పట్టా రమేష్ బాబు
గిరి ప్రదక్షిణ సందర్భంగా తెలియజేశారు . ఫౌండేషన్ సభ్యులు బొడ్డేడ వెంకటలక్ష్మి , జి దేముడుబాబు, పీతల తాతయ్యనాయుడు , దొడ్డి రమేష్ , ఆర్ భాస్కర్ రావు , బ్రహ్మాజీ , పెంటకోట నూకరాజు, కార్తీక్
శ్రీలక్ష్మి శ్రీదేవి, వర్షిని అఖిల మొదలగు సభ్యులు పాల్గొన్నారు
సింహాచలు దేవస్థానం సందర్భంగా భక్తులతో పోటెత్తిన దేవస్థానం
68