ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం
ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం అని వ్యూస్ ఎన్ జి ఒ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ భీంరావు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉదయం సమత డిగ్రీ కళాశాలలో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. తమ సంస్థ ఆస్ట్రేలియన్ ఎంబసీ సహాయం తో పని చేస్తుంది అన్నారు. భవిష్యత్తు తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు. జీవవైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చెయ్యాలి అని కోరారు. శీతోష్ణస్థితి వేడెక్కకుండా కృషి చేయడానికి విద్యార్థులు కృషి చేయవలసిన అవసరం ఉందన్నారు.
సమంతా కళాశాల డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తమ విద్యా సంస్థలో ఔషధ వనాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం, ప్రతి విద్యార్థి కనీసం పది మొక్కలు నాటి పెంచాలని కోరారు. సమస్త జీవరాశినీ కాపాడుకునేందుకు, పర్యావరణ హితంగా జీవించడానికి ప్రతీ విద్యార్థీ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో టీచింగ్ ఫ్యాకల్టీ రాజా ప్రవీణ మాట్లాడుతూ తూర్పు కనుమలలో లభ్యమయ్యే అన్ని ఔషధ మొక్కలు సేకరించి పెంచడానికి కృషి చేస్తున్నామన్నారు. 40 శాతం నుండి 80 శాతం ప్రాణవాయువు ఇచ్చే సముద్రాల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. తాము విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ అంశాల మీద అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో సంస్థ టీచింగ్ ఫ్యాకల్టీ సభ్యులు, విద్యార్థులు, వ్యూస్ సంస్థ కో ఆర్డినేటర్ జె రాజేశ్వరి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొన్నారు.
ఔషధ గుణాలు కలిగిన మొక్కలను నాటి పెంచుదాం గ్రీన్ క్లైమేట్ టీం & Eco Vizag
55