భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం
– మొక్కలు నాటి పెంచుదాం
– సమస్త జీవరాశినీ కాపాడుకుందాం
– పర్యావరణ హితంగా జీవించుదాం.
– జెవి రత్నం. వ్యవస్థాపక కార్యదర్శి. గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ.
భూగర్భ జలాలు పెంపొందించేందుకు కృషి చేద్దాం అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం కోరారు. ఈ మేరకు బుధవారం ఉదయం సింహపురి లే అవుట్ 2 లో వాకర్స్ క్లబ్ ప్రతినిధులు గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ అందజేసిన దేవతా వృక్షాల మొక్కలు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం పది మొక్కలు నాటి పెంచాలని కోరారు. శీతోష్ణస్థితి వేడెక్కిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అధికంగా మొక్కలు నాటి పెంచాలని అన్నారు. కాంక్రీట్ జంగిల్ గా మారిన విశాఖపట్నం నగరంలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని కోరారు. సమస్త జీవరాశినీ కాపాడుకుందాం, పర్యావరణ హితంగా జీవించుదాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పోర్ట్ విశ్రాంత ఇంజినీర్ జనార్ధన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి కర్తవ్యంగా భావించాలి అని అన్నారు. ప్రస్తుతం వేడి గాలుల వల్ల కలిగుతున్న నష్టాలు దృష్టిలోకి తీసుకుని అత్యధికంగా మొక్కలు నాటి పెంచాలని కోరారు.
అడ్వకేట్ సూర్య నారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ పిల్లల చేత మొక్కలు నాటి పెంచే విధంగా కృషి చెయ్యాలి అన్నారు. వాళ్ళు అలా అలవాటు చేసుకుంటే భవిష్యత్తు తరాలు హాయిగా జీవించగలుగుతారన్నారు.
గృహిణి లక్ష్మి మాట్లాడుతూ ఎవరి ఇంటి వద్ద వాళ్ళు ప్రకృతి ఆధారిత పంటలు పండించు కోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడటం అనారోగ్యకరం అన్నారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కె. శ్రీనివాసరావు, గోపాల్, రమేష్ రెడ్డి, హరిదాసు, ప్రకాష్ తదితరులు మాట్లాడారు.
భూగర్భ జలాలను పెంపొందించుటకు కృషి చేద్దాం గ్రీన్ క్లైమేట్ టీం అండ్ Eco Vizag
58