ఎండాడ వైసిపి…….
విశాఖ ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి ప్రభుత్వాధికారులు నోటీసులు ఇచ్చారు. జీవీఎంసీ అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టారని నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో దీనిపై వివరణ ఇవ్వాలని గడువు ఇచ్చారు.
ఎండాడలోని సర్వే నంబర్ 175/4లో 2ఎకరాల స్థలంలో వైసీపీ కార్యాలయాన్ని నిర్మించింది. దీనికి ఎలాంటి అనుమతులు లేవని అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులను స్కిప్ చేసి నేరుగా వీఎంఆర్డీఏకు దరఖాస్తు చేశారు. అక్కడ కూడా సరైన అనుమతులు రాకుండానే నిర్మాణాలు పూర్తి చేశారు.
దీనిపైనే జీవీఎంపీ అధికారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతు లేకుండా భవనాలు ఎలా నిర్మించారని ప్రశ్నిస్తున్నారు.
ఈ నోటీసులు తీసుకునేందుకు ఆ కార్యాలయంలో ఎవరూ లేకవపోవడంతో జివిఎంసి జోన్ 2 ప్లానింగ్ అధికారులు అక్కడ గోడకు అతికించి వెళ్లిపోయారు.