ప్రతీ ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించండి
– ఎకో వైజాగ్ ను విజయవంతం చేయండి
– ప్రకృతి ఆధారిత పంటలు ఆరోగ్యకరం
– ప్రతి ఒక్కరూ ఇంటి పైకప్పు మీద కూరగాయలు, ఆకుకూరలు పండించండి
– సత్తి లలితా రెడ్డి, అధ్యక్షులు, మాధవ ధార మహిళా వాకర్స్ అసోసియేషన్
ప్రతీ ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించండి అని మాధవ ధార మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్తి లలితా రెడ్డి కోరారు. సోమవారం ఉదయం బాల భాను విద్యాలయం లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నగరం లోని విద్యార్థులు, విద్యార్థినులు చేత చిత్రలేఖనం పోటీలు నిర్వహించడం జరిగింది. సుమారు 150 మంది విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు అత్యద్భుతం గా పర్యవరణ పరిరక్షణ, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యము, జల కాలుష్యం, ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు పెంచాలని , కాలుష్య నివారణ చర్యలు తీసుకోవాలని అర్థం వచ్చేలా చిత్రాలు వేసారు. న్యాయ నిర్ణేతగా వ్యవహరించిన చిత్ర కళాకారుడు( పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశ్రాంత మేనేజర్ ) డబ్బిరు ఉదయాభాస్కర రావు నిర్ణయం మేరకు రెండు కేటగిరి లలో ప్రథమ, ద్వితీయ, తృతీయ, కంసోలేషన్ బహుమతులు నిర్ణయించారు.
ముఖ్య అతిథి గవర్నర్ ఎలెక్ట్ కె ద్వారకానాథ్ బహుమతులు, జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందజేశారు,పాల్గొన్న ప్రతి ఒక్క విద్యార్థి కి జనరల్ నాలెడ్జ్ బుక్స్ , పెద్ద బాల శిక్ష పుస్తకాలను సత్తి సునీల్ రెడ్డి ,సత్తి లలితా రెడ్డి అందించేశారు.
విశిష్ట అతిది గా విచ్చేసిన గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యతను వివరించి హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు ఎకొవైజాగ్ లో బాగంగా కూరగాయలు, ఆకుకూరలు విత్తనాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు, డాక్టర్లు, సంస్థ ప్రతినిధులు మాట్లాడారు
.
5th June World 🌍🌎 Environmental day ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అవగాహన
68