విశాఖ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అకాడమీ – కళ భారతి కీర్తిశేషులు పైడా కౌషిక్ నాటక ఉత్సవం 2024 విశాఖపట్నం

by vvwnews.com

కళాభారతి – కీ.శే. పైడా కౌషిక్ నాటకోత్సవములు – 2004

19వ రాష్ట్రస్థాయి ఆహ్వాన సాంఘిక నాటికల పోటీలు

వేదిక: కళాభారతి,

విశాఖపట్నం:

కళాభారతి (ఏ.సి) ఆడిటోరియంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో వి.ఎమ్.డి.ఎ. , నాటకోత్సవాల అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, గత 19 సంవత్సరాలుగా నిర్వహించబడుతన్న నాటకోత్సవాలు, ఈ నెల 12, 13, 14, 15, 16 తేదీలలో నిర్వహంచబడుతున్నాయని, రెండు తెలుగు రాష్ట్రాలనుంచి మొత్తం 40 ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. వాటినన్నింటిని ప్రోగ్రాం కమిటీ సభ్యులందరూ అధ్యయనం చేసి 9 నాటికలను ఎంపిక చేశారని, మొదటి నాలుగు రోజులు, రోజుకు రెండు నాటికలు, చివరి రోజు 16 వ తేదీన ఒక నాటిక ప్రదర్శించబడి, ఆ తరువాత వెంటనే సీ ఏం ఆర్ సౌజన్యంతో బహుమతి ప్రదానోత్సవం జరుగునని వివరించారు.

వి.ఎమ్.డి.ఎ. ట్రస్టీ, నాటకోత్సవాల ప్రధాన కార్యదర్శి డాక్టర్ జి.ఆర్.కె. ప్రసాద్ (రాంబాబు) మాట్లాడుతూ, ప్రదర్శించే ప్రతి నాటికకు రూ. 13,000 పారితోషికం ఇవ్వటానికి నిర్ణయించారని, ప్రదర్శన రోజు స్థానికేతర సమాజాలముల వారి భోజన ఖర్చులు , లోకల్ కన్వేయన్స్ నిమిత్తం రూ.4000 అందజేయబతు న్నదని, అదనంగా వసతి ఉచితంగా ఏర్పాటు చేయబడుతున్నదని తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందిన వారికి ఉత్తమ ప్రదర్శనకు రూ.18,000, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.15,000, తృతీయ ఉత్తమ ప్రదర్శనకు రూ.12,000, చతుర్థ ఉత్తమ ప్రదర్శనకు రూ. 10,000 నగదుతో పాటు జ్ఞాపికలు అందజే యబడుతాయని, ఇవిగాక 12 వ్యక్తిగత బహుమతులు ఒక్కొక్కరికి రూ. 1500, జ్ఞాపికలు అందజేయ బడుతాయని, మూడు జ్యూరీ బహుమతులు ఒక్కొక్కరికి రూ.1000 నగదుతో పాటు జ్ఞాపికలు అందజేయబ డుతాయని, ప్రోత్సాహక బహుమతుల క్రింద నాటికలలో పాల్గోన్న ప్రతి బాల, నటీ నటులకు రూ. 1000 నగదుతో పాటు జ్ఞాపికలు బహూకరించబడతాయని, ఈ పోటీలలో ప్రదర్శించిన ప్రతి నాటిక రచయిత, దర్శకుడికి సర్టిఫికెట్ లు అందజేయబడుతాయని తెలియజేశారు.

నాటకోత్సవాల మహారాజపోషకులు పైడా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, తెలుగునేల మీద ప్రఖ్యాతి గాంచిన ఈ నాటకోత్సవాలకు పోషకులుగా వుండటం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, రాబోయే కాలంలో కూడా ఈ నాటకోత్సవాల నిర్వహణకు తన వంతు సహాయ సహకారాలు ఇలాగే కొనసాగిస్తానని చెప్పారు. అన్ని రోజులు నాటక ప్రదర్శనలకు ప్రవేశం ఉచితమని, వచ్చిన ప్రేక్షకులకు ప్రతిరోజు లాటరీ తీసి బహుమతులు ఇవ్వబడుతాయని తెలియజేశారు. నాటకోత్సవాల చీఫ్ కన్వీనర్, నాటకోత్సవాలలో ఏర్పాటుచేస్తున్న మహాప్రాంగణకర్త సుప్రసిద్ధ రంగ స్థల, సినీ నటులు, స్వర్గీయ కుప్పిలి వెంకటేశ్వరరావు రోజువారి ప్రాంగణకర్తల వివరాలు అందజేశారు. చీఫ్ అడ్వైజర్ ఆచార్య బాబివర్ధన్ మాట్లాడుతూ, ఈ నాటకోత్సవాల విజయంలో పాత్రికేయుల పాత్ర చాలా విశిష్టమైనదని, ఈ ఉత్సవాల సమాచారాన్ని రెండు తెలుగు రాష్ట్రంలోని అన్ని పాంతాల వారికి తెలియజేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో నాటకోత్సవాల ఎగ్జిక్యూటివ్ కన్వీనర్స్ బొడ్డేటి జగర్రావు, వి. నాంచారయ్యలతో పాటు ఇతర కార్యవర్గసభ్యులు, పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles