రవాణా రంగ కార్మిక సమస్యలు పరిష్కారం చేసే వాళ్లకే మా ఓటు AIRTW

by vvwnews.com

ప్రెస్‌ నోట్‌
*రవాణా రంగ కార్మికుల సమస్యలు పరిష్కారం చేసిన వారికే మా ఓటు అడిగే హక్కు.*
ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య
రోడ్డు రవాణా డ్రైవర్లుకు సామాజిక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి, ఊరిత్రాడు వంటి సెక్షన్‌ 106 (1Ê2), మోటారు ట్రాన్స్‌పోర్టు సవరణ చట్టం 2019, జివో నెం. 21ని రద్దు చేయాలని, ఓలా,ఉబర్ తరహా ప్రత్యామ్నాయ యాప్ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, పెట్రోల్‌, డీజిల్‌లో పన్ను మినహాయింపు ఇస్తామని చెప్పిన పార్టీలు మాత్రం డ్రైవర్ ఓటు అడిగే హక్కు ఉంటుంది అని సిఐటియు జగదాంబ ఆఫీస్‌లో సదస్సు లో ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ ఫెడరేషన్‌ (ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి ఆర్‌.లక్ష్మయ్య పిలుపు ని ఇచ్చారు. అలాగే విశాఖజిల్లా మోటారు జిల్లా మోటార్‌ ట్రాన్స్‌పోర్టు వర్కర్స్‌ యూనియన్‌ గౌ॥ బి.జగన్‌, అధ్యక్ష, కార్యదర్శులు శివ, అప్పలరాజు, క్యాబ్ యూనియన్ నాయకులు శ్రీనివాస్, పోలినాయడు,ఆటో రిక్షా కార్మిక సంఘం ప్రధానకార్యదర్శి కె సత్యనారాయణ అద్యక్ష వహించి మాట్లాడారు.
మాట్లాడుతూ మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టం, సెక్షన్‌ 106 (1Ê2) అనేక దాడులు చేస్తున్నారు. రవాణా రంగంలో అత్యధిక మంది ప్రయాణీకులకు సేవలందించే వారిలో రోడ్డు రవాణా డ్రైవర్లది కీలకస్థానం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం డ్రైవర్ల మెడకు ఉరితాడు బిగించే విధంగా సెక్షన్‌లు 106 (1) (2) హిట్‌ అండ్‌ రన్‌. చట్టాన్ని 21 డిసెంబర్‌ 2023న తీసుకువచ్చింది. గతంలో ప్రమాదానికి డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణం అయితే గరిష్టంగా 2 సంవత్సరాలు శిక్ష ఉండేది. ఇప్పుడు మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన సెక్షన్‌ 106 (1) (2) ప్రకారం 10 సంవత్సరాల జైలు 7 లక్షల జరిమానా విధించేలా నిబంధనలు తయారు చేసింది. ఇప్పటివరకు ప్రమాదాలు జరిగిన వంటనే స్టేషన్‌ బెయిల్‌ తీసుకునే అవకాశం ఉండేది. కొత్త చట్టంలోని నిబంధనల వలన కోర్టులో మెయిల్‌ కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. జివో నెం. 21 Ê 2019 మోటారు ట్రాన్స్‌పోర్టు చట్టంలో భారీగా పెంచిన జరిమానాలు అమలులోకి వచ్చి 4సంవత్సరాలయ్యింది. కానీ ప్రమాదాలు తగ్గలేదు సరికదా 2022లో ప్రమాదాలు పెరిగాయని ప్రభుత్వ గణాంకాలే తెలియజేస్తున్నాయి. అందుచేత ప్రమాదాలకు అసలైన కారణాలను పరిష్కరించకుండా శిక్షలు పెంచితే ప్రమాదాలు తగ్గుతాయని చెప్పడం మోసగించడమేనని అనుభవం రుజువు చేస్తున్నది.
రవాణా రంగ కార్మికుల ద్వారా ప్రభుత్వాలకు లక్షల కోట్ల రూపాయలు సంపాదించి పెడుతున్న మోటారు కార్మికుల సంక్షేమానికి ఎటువంటి చట్టం లేకుండా పోయింది. డ్రైవర్లు ఏ విధమైన ప్రమాదానికి గురి అయినా ఆ కుటుంబానికి ఎటువంటి ఆర్ధిక సహాయం అందడం లేదు. ఆటో డ్రైవర్లు ఇతర రవాణా రంగ కార్మికులకు రక్షణ కల్పించే విధంగా కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, డిల్లీ రాష్ట్రాల తరహాలో సమగ్ర సంక్షేమ చట్టాన్ని చేయాలని వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు డిమాండ్‌ చేస్త్తున్నది.

ఇట్లు
బి.జగన్‌
గౌ॥ అధ్యక్షులు

Use Social Media to Spread the Word about Our News

related articles