రహదారి భద్రత – ప్రతిజ్ఞ నేషనల్ రోడ్డు 🦺 🛟 సేఫ్టీ మంత్

by vvwnews.com

పత్రిక ప్రకటన

రహదారి నిబంధనలను పాటించండి

రహదారి భద్రత మాసోత్సవాలలో భాగంగా లక్ష్మి వారం తేది 15.02.2024 న కంచరపాలెం లో గల ఓల్డ్ ఐ.టి.ఐ లో రహదారి భద్రత మీద అవగాహనా సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా రీజినల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ శ్రీ ఆర్. సి. హెచ్. శ్రీనివాస్ గారు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీ ఐ. రఘు బాబు గారు, మోటారు వాహన తనిఖీ అధికారి శ్రీ గణేష్ రెడ్డి గారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా నిర్లక్ష్యంగా నడపడం వలన మరియు ద్విచక్ర వాహనం నడిపేటపుడు హెల్మెట్ ధరించకుండా వాహనం నడపడం వలన ఎక్కువగా జరుగుతున్నాయని దాని వలన వారొక్కరే కాకుండా వారి కుటుంబం ఆసరా లేకుండా పోతుందని, కనుక ప్రతి ఒక్కరు విధిగా ద్విచక్ర వాహనం నడిపినపుడు హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రముల వాహనములు నడిపేటపుడు సీటు బెల్టు పెట్టుకోవాలని తెలియజేశారు. అనంతరం వాకతాన్ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యాక్రమంలో పాల్గొన్న వారితో రహదారి భద్రత నిబంధనలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో ఐ.టి.ఐ. ప్రిన్సిపాల్ గారు జె. శ్రీకాంత్, మరియు వైస్ ప్రిన్సిపాల్ యు. ఉమాశంకర్ గారు, తదితరులు పాల్గొన్నారు.
ఇట్లు
ఉప రవాణా కమిషనర్
విశాఖపట్నం

Use Social Media to Spread the Word about Our News

related articles