NIJI SHOTOKAN NATIONAL OPEN KARATE 🏆🏆🏆 2024

by vvwnews.com

9 నుంచి జరిగే కరాటే పోటీలు విజయ వంతం చేయాలి

– హీరో సుమన్

సీతమ్మ ధార (విశాఖ ఉత్తర):

నిజి శాటోఖాన్ స్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా, నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడెమీ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ ఓపెన్ కరాటే చాంపియన్ షిప్ పోటీలు జరుగుతాయి అని
నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడెమీ అధినేత
ఎస్ పి ఎం డి నాయుడు
తెలిపారు. బాలయ్య శాస్త్రి లే అవుట్ లో గల సింధూర అతిధి గృహంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలు అక్కయ్య పాలెం పోర్ట్ స్టేడియం లో గల విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో జరుగుతాయి అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ నటుడు, ఎన్ ఎస్ ఎస్ కే ఏ ఐ చైర్మన్
సుమన్ మాట్లాడుతూ, కరాటే ద్వారానే సినిమా రంగానికి వచ్చాను అన్నారు. తాను పది భాషల్లో వందలాది సినిమాలు చేశాను అని గుర్తు చేశారు. అయోధ్యలో శ్రీ రామదాసులో తన సన్నివేశాలు ప్రదర్శించారు అని సంతోషం వ్యక్తం చేశారు. విశాఖ కరాటే హబ్ గా వుండడం హర్షణీయం కరాటే మాస్టర్లు ఎన్నో కష్టాలు ఎదుర్కుంటు, కరాటే అభివృద్ధి కి కృషి చేస్తున్నారు అన్నారు. విశాఖలో నాయుడు సెల్ఫ్ డిఫెన్స్ అకాడెమీ అధినేత నాయుడు కరాటే పోటీల నిర్వహణ లో పేరు ప్రక్యాతులు తెచ్చుకున్నారు అని కొనియాడారు. క్రీడాకారులు డ్రగ్స్ కు దూరంగా ఉండాలి అని కోరారు. డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలు విద్యార్థులకు వివరించాలి బాలికలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతయినా అవసరం అన్నారు.
అనంతరం ఆయన చాంపియన్ షిప్ ట్రోఫీలు, పోస్టర్స్ ఆవిష్కరించారు.
పోటీల కార్యనిర్వహక చైర్మన్ దాడి రత్నాకర్, మాట్లాడుతూ, ఈ పోటీలు ఫిబ్రవరి లో జరుగుతాయి
అన్నారు.

మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ,
మాట్లాడుతూ, వచ్చేనెల 9,10,11 తేదీల్లో పోటీలు జరుగుతాయి అని తెలిపారు. హీరో సుమన్ క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడం హర్షణీయం అన్నారు.
సింహాచలం దేవస్థానం ధర్మకర్త గంట్ల శ్రీను బాబు మాట్లాడుతూ, హీరో సుమన్ విశాఖలో జరిగే కరాటే పోటీలకు ఎంతగానో ప్రోత్సాహం ఇస్తున్నారు అని ప్రశంసించారు.

సి.ఐ. అప్పల నాయుడు మాట్లాడుతూ, విద్యార్థులకు ఆత్మ రక్షణకు కరాటే దోహదం చేస్తుంది అన్నారు.

ఎస్ జీ గ్రూప్ అధినేత కె. శ్రీరామ్, శ్రీనివాస్
తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles