జీవీఎంసీ వెస్ట్ జోన్ ఆఫీసులో ఏసీబీ దాడి: రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జూనియర్ అసిస్టెంట్**

by vvwnews.com

**జీవీఎంసీ వెస్ట్ జోన్ ఆఫీసులో ఏసీబీ దాడి: రూ.30 వేలు లంచం తీసుకుంటూ దొరికిన జూనియర్ అసిస్టెంట్**

విశాఖ ఎన్‌ఏడీ కొత్త రోడ్డు జంక్షన్ సమీపంలోని జీవీఎంసీ వెస్ట్ జోనల్ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఓ వ్యక్తి కుటుంబ సభ్యునికి సంబంధించిన మరణ ధ్రువీకరణ పత్రం (డెత్ సర్టిఫికెట్) జారీ చేసేందుకు జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ రూ.30,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన అధికారులు.. కార్యాలయంలో బాధితుడి నుండి శ్రీనివాస్ నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles