ప్రెస్ నోట్:
సమ సమాజ స్థావనలో అఖిల భారతీయ మార్వాడి సమ్మేళనం
సమ సమాజ నిర్మాణంలో అఖిల భారతీయ మ్వారి సమ్మేళన్ ముఖ్య భూమిక పోషిస్తుందని ఆ సంస్థ జాతీయ అధ్యక్షులు పవన్ కుమార్ గోయంకా తెలిపారు. సామాజిక బాధ్యతతో పని చేస్తున్న తమ సంస్థ ఎన్నో విజయాలు సొంతం చేసుకుందని చెప్పారు రాజస్థాన్ సాంస్కృతిక్ మండలి భవన లో శనివారం జరిగిన పాత్రికేయులు సమావేశంలో పవన్ కుమార్ గోయంతా మాట్లాడారు. 1935లో కోల్ కత్త కేంద్రంగా ఆవిర్భవించిన అఖిల భారతీయ మార్వాడి సమ్మేళన్ 18 రాష్ట్రాలలో వివిధ శాఖల ద్వారా సేవలు అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, విజయవాడ, గుంటూరు, రాజమండ్రిలో తమ శాఖలు ఉన్నాయని తెలియజేశారు. ఈ శాఖలలో 500 మంది సభ్యులు ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా విశాఖపట్నంలోని పారిశ్రామిక ప్రాంతం గాజువాకలో నూతన, శాఖను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
విస్తృతంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలలో తమ సంస్థ సభ్యులు భాగస్వామ్యం అవుతున్నారవి ఆయన పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా తమ సంస్థ జాతీయ కార్యవర్గ సమావేశాన్ని ఈ నెల 14వ తేదీ ఆదివార నిర్వహిస్తున్నట్లు పవన్ కుమార్ గోయంకా తెలియజేశారు. పాత్రికేయుల సమావేశంలో అఖిల భారతీయ మార్వాడి సమ్మేళన్ ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ మిశ్రా, ప్రధాన కార్యదర్శి కేదార్నాథ్ గుప్తా, కోశాధికారి అనిల్ కుమార్ మాలావత్, సంయుక్త కార్యదర్శి పవన్ బన్సల్, పూర్వ కార్యదర్శి కైలాస్ తోది, ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు ఓం ప్రకాష్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి బాల కిషన్ లోహియా.
విశాఖపట్నం శాఖ అధ్యక్షులు పొడేస్వర్ పురోహిత, ప్రధాన కార్యదర్శి రాజేష్, కొరారి, కోశాధికారి రాజేష్ బన్సల్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు, జాతీయ కార్యవర్గ సభ్యులు చాంద్ మాల్ అగర్వాల్ పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్నారు.