కంటి కాన్సర్ అవగాహనపై వైటాథాన్ రన్
విశాఖపట్నం 24 మే 2026: ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, GMR వరలక్ష్మి ప్రాంగణం,విశాఖపట్నం వద్ద రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్) అనే వ్యాధి గురించి అవగాహన కల్పించుటకు ఈరోజు (24మే2026) ఉదయం 6 గంటలకు బీచ్ రోడ్డులోని కాళీమాత గుడి దగ్గర నుంచి YMCA వరకు “ వైటాథాన్” పరుగు కార్యక్రమం నిర్వహించారు. ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ విశాఖపట్నం ప్రాంగణం హెడ్ డాక్టర్ వీరేందర్ సచ్దేవా, డాక్టర్ సునీత మరియు డాక్టర్ లావణ్య సంస్థ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. వీరితో పాటు ఈ “ వైటాథాన్” పరుగు నందు సుమారు 200 మంది ఔత్సాహికులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
వైటాథాన్ రన్ రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్) గురించి సరియైన అవగాహన కలిగించటం మరియు ఈ వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం నిధులు సేకరించడానికి ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ (LVPEI) వారు నిర్వహించే ఒక సామాజిక వార్షిక కార్యక్రమం. “ వైటాథాన్” రన్ కార్యక్రమాన్ని 5వ సారి నిర్వహించారు. ఈ వ్యాధిని ఆలస్యంగా గుర్తించడం మరియు సరైన చికిత్స అందకపోవడం వల్ల పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. రెటినోబ్లాస్టోమా కణితిని ప్రారంభదశ లోనే గుర్తించి చికిత్స అందిస్తే పూర్తిగా నయం చేయవచ్చును. పిల్లల దృష్టిని కాపాడ వచ్చును.
ఈ సందర్భంగా ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, విశాఖపట్నం ప్రాంగణం హెడ్ డాక్టర్ వీరేందర్ సచ్దేవా, మాట్లాడుతూ రెటినోబ్లాస్టోమా (కంటి క్యాన్సర్) అవగాహన ప్రాముఖ్యతను వివరిస్తూ, “రెటినోబ్లాస్టోమా లక్షణాలను సకాలంలో గుర్తించి మరియు సరియైన చికిత్స చేయాల్సి ఉంటుందని, ప్రతి సంవత్సరం తమ సంస్థ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించటమే కాకా, ఈ వ్యాధి నివారణకు దాతల నుండి విరాలను సేకరించి, పేద పిల్లల కంటి వైద్యానికి ఉపయోగించటం జరుగుతుందని వివరించారు.
వైటాథాన్-2026 రన్ సందర్భంగా ఎల్.వి. ప్రసాద్ నేత్ర వైద్య సంస్థ, విశాఖపట్నం ఆక్యులర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సునీత మాట్లాడుతూ “రెటినోబ్లాస్టోమా లక్షణాలను సకాలంలో గుర్తించి మరియు సరియైన చికిత్స అందించవలసిన ప్రాముఖ్యత గురించి అవగాహనను ప్రజలకు, ముఖ్యంగా యువ తల్లిదండ్రులకు కల్పించటం కీలకం అన్నారు. పిల్లల దృష్టిని మరియు జీవితాన్ని కాపాడటానికి ముందుగా గుర్తించడం మరియు చికిత్స చేయడం చాలా ముఖ్యం” అని ఆమె అన్నారు.
ఈరోజు విశాఖపట్నం బీచ్ రోడ్డు నందు నిర్వహించిన వైటాథాన్-2026 నకు విశేష స్పందన లభించినదని అనేక మంది ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేసారని, వైటాథాన్ రన్ నందు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు క్యాంపస్ హెడ్ డాక్టర్ వీరేందర్ సచ్దేవా.
కంటి కాన్సర్ అవగాహనపై వైటాథాన్ రన్ విశాఖపట్నం 24 మే 2026: ఎల్.వి. ప్రసాద్
0
previous post