ఎన్ హెచ్ ఆర్ సి అవార్డు చిత్రాల ప్రదర్శన #vvwnews #news

by vvwnews.com

ఎన్ హెచ్ ఆర్ సి అవార్డు చిత్రాల ప్రదర్శన

జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా జరుగుతున్న లఘు చిత్రాల పోటీలలో ఉత్తమ బహుమతులు పొందిన చిత్రాలను మానవ హక్కుల కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం స్థానిక పౌర గ్రంథాలయంలో ప్రదర్శించారు. చిత్రాల ప్రదర్శనను ఆంధ్ర విశ్వ కళా పరిషత్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పల్లవి, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ కార్యదర్శి శ్యాంప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు పొందిన చిత్రాలతో పాటు కన్సోలేషన్ బహుమతులు పొందిన చిత్రాలు ప్రదర్శించారు. అంటరానితనం, విద్యా హక్కు, బాల్య, మహిళల వివక్ష తదితర అంశాలను ఆధారంగా చేసుకుని తీసిన ఈ చిత్రాలను విద్యార్థులతో సహా పలువురు మానవ హక్కుల డిపెండర్లు తిలకించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా బహుమతులు పొందిన చిత్రాలను ప్రదర్శించి ప్రజలకు మానవ హక్కుల పట్ల అవగాహన కల్పిస్తున్న కౌన్సిల్ను అభినందించారు. కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు సన్ మూర్తి, విశాఖ వైజాగ్ ఫిల్మ్ సొసైటీ కార్యదర్శి నరవ ప్రకాష్ రావు, కౌన్సిల్ కార్యవర్గ సభ్యులు ఎస్వీ రమణ పలువురు కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్రాల విశిష్టతను వివరించారు. 1999 నుంచి మానవ హక్కుల కౌన్సిల్ అనేక కేసులను జాతీయ మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లిందని కార్యదర్శి శ్యాం ప్రసాద్ తెలిపారు. గత 3 ఏళ్ళుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మన్నారు. కార్యక్రమంలో నగరానికి చెందిన పలువురు కళాకారులు చేన్నా తిరుమల రావు, నక్క అప్పారావు, వంశీ బాబు, డాక్టర్ వాసంతి, శ్యామ్, విజయ్, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles