కుల మత రాజకీయాలకతీతంగా జరిపే మూడు గ్రామాల పండుగ ఎన్ని దుర్గ మాంబ పండగ.
తోట గరువు ఎర్ని దుర్గమ్మ పండుగ పోస్టర్ ఆవిష్కరణలో సభలో పేర్కొన్న ప్రతినిధులు
విశాఖపట్నం
గ్రేటర్ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిధిలో గల తోటగరువు ప్రాంతంలో వేంచేసియున్న ఎర్ని దుర్గ మాంబ పండుగ ప్రారంభ వేడుక పోస్టర్ ఆవిష్కరణ సభలో పాత తరం వారు కొత్త తరం వారు మేలు కలయిక స్పష్టంగా కనిపిస్తుంది అమ్మవారి వేడుక వివరాలు తెలుపుతూ ప్రెసిడెంట్ మొల్లి అప్పలరాజు మాట్లాడుతూ 23 తారీకు మే నెల నుంచి ప్రారంభమై 26 తారీకు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా 23 తారీకు తోలేలు నుంచి ప్రారంభమై 24 25 తారీకు 26 తారీకుల్లో అమ్మవారికి కుంకుమ పూజలు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారి భక్తులకు సాంస్కృతి కార్యక్రమాలు భారీ బాణాసంచా మరియు స్టేజి ప్రోగ్రాములు తోటగరువు అంతా వీధి దీపాలతో పాటు అమ్మవారి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలవకుండా అన్న పానీయాలు కూడా ఏర్పాటు చేస్తున్నామని అమ్మవారికి కుంకుమ పూజలు చేయ భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుంచి విచ్చేసి తీర్థపానియాలు తోపాటు అమ్మవారి ఆశీస్సులు కూడా గైకొనమని ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ మాతరం అంతా పండుగ అన్ని గ్రామాలతో పాటు రాజకీయాలకతీతంగా అందరూ కలిసి జరుపుకునే పండుగని దీనికి కొత్త కమిటీలో యువతరం బాగా ఉందని యువతరం మా సలహా సూచనలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ యువ రక్తం ముందుకు సాగుతుందని మేము పాటించినట్టే సాంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇస్తూ మా యవరక్తం ముందుకెళ్లడం మాకు చాలా ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మూడు గ్రామాల పెద్దలు మాట్లాడుతూ
ఆరిలోవ ఒక పరిధిలోని మూడు గ్రామాల ఇలవేల్పు ఎర్ని దుర్గమాంబ అమ్మవారి పండుగ ఈనెల 23 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు గ్రామ పెద్దలు విలేకరుల సమావేశంలో తెలిపారు. తోట గరువు పెదగదిలి చిన్న గదిలి ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ఈ పండుగ గడిచిన 40 సంవత్సరాలుగా నిర్వహించుకుంటున్నారని ఆలయ నిర్మాణం ఆధునికరణ చేయవలసి ఉందని తెలిపారు. దాతల సహకారం ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు ఆలయ అభివృద్ధిలో పంచుకోవాలని సూచించారు. అన్ని కులాల సహకారం ఈ పండుగలో ఉందని వర్గ విభేదాలు లేకుండా పనిచేస్తున్నామని గ్రామ కమిటీలు యువకులు ఉత్సాహంగా ఈ పండుగలు కీలక పాత్ర పోషిస్తున్నారని పెద్దలు వెల్లడించారు.
శ్రీశ్రీశ్రీ ఎర్ని దుర్గామాంబ అమ్మవారి పండుగ మహోత్సవములు 2026 తోట గురువు గ్రామం విశాఖ 23,24,25& 26
0