*పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం మండల్ ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల ప్రభుత్వ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు గారు*
నిధులు తెచ్చే బాధ్యత నాది … పనులు పూర్తిచేసే బాధ్యత మీది.
అధికారులకు నిర్దేశించిన పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు.
ఈ రోజు అనగా *05.05.2026* తేదీన పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని పెందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిషత్ అధ్యక్షురాలు శ్రీమతి శ్రీ గన్రెడ్డి మాలతి నగేష్ అధ్యక్షతన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, మండల ప్రాదేశిక నియోజకవర్గం సభ్యులతో, మండలంలో జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై జనసేన విశాఖ ఉమ్మడి రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి శాసనసభ్యులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు సమీక్ష నిర్వహించారు.
సుధీర్గంగా సాగిన ఈ సమీక్ష సమావేశంలో మండల పరిషత్, రెవిన్యూ శాఖ, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యూ ఎస్, జాతీయ ఉపాధి హామీ పథకం, విద్యుత్ శాఖ అధికారులతో పాటు మండల ప్రాదేశిక నియోజకవర్గాల సభ్యులు పాల్గొని జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే ఇంకా జరగాల్సిన పనుల గురించి ప్రజల అవసరాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు నిధులు కొరత గురించి ఆలోచించవద్దని, ప్రభుత్వం నుండి నిధులు తీసుకొచ్చే బాధ్యత తనదని, ప్రజల అవసరానికి అనుగుణంగా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేసే బాధ్యత అధికారులద ని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని గాలికి వదిలేయడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ ఎక్కడా ఎలాంటి అభివృద్ధి ఛాయలు కనబడలేదని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వచ్చిన తర్వాత శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, వాటిని మరింత పరుగులు పెట్టించాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నాటికి అన్ని ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాక వైసిపి ప్రభుత్వ కాలంలో నిలిచిపోయిన 12 కోట్లు విలువైన 28 పనులు కూడా త్వరలోనే ప్రారంభిస్తామని దీనిపై ఇప్పటికే జీవీఎంసీ కమిషనర్ తో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ఇంకా పినగాడి రోడ్డు, జుత్తాడ రోడ్డు, అడవివరం శొంట్యాం రోడ్డు సహా 12 రోడ్లను భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు.
ఎంపీటీసీలు అభివృద్ధి పనులపై శ్రద్ధ తీసుకొని గ్రామాల్లో నాయకులను కలిసి అవసరమైన అభివృద్ధి పనులకు సంబంధించిన నివేదికలు తయారు చేయించాలని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు గారు సూచించారు ముఖ్యమంత్రి గారికి నివేదించాల్సిన పనులు సుమారు 20 వరకు ఉన్నాయని వాటిపై త్వరగా నివేదిక తయారు చేస్తే తాను స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి అందిస్తానని ఎమ్మెల్యే రమేష్ బాబు తెలియజేశారు. అధికారులు ఎంపీటీసీలు బాధ్యతగా అభివృద్ధి పనులను పరిగెత్తించాలని ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి ఇంటి వెంకట అప్పారావు గారు, మండల ఏవో కొల్లి వెంకటరావు గారు, స్వర్ణ గ్రామ వార్డ్ అధికారులు డిప్యూటీ ఎంపీడీవో రామారావు గారు, ఈ వో ఆర్ డి కామేష్ గారు, పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ అయిత సింహాచలం గారు, పెందుర్తి మండలం వైస్ ఎంపీపీ చిరికి దేముడు గారు, రాంపురం ఎంపీటీసీ గండి హిమ బిందూ గారు,సరిపిల్లి ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ గారు, వాలిమెరక ఎంపిటిసి సయ్యపురాజు స్వప్న గారు, పెదగాడి ఎంపీటీసీ నందవరపు అప్పలరాజు గారు, మండల కో ఆప్షన్ నెంబర్ ముదపాక శివ గారు, సీనియర్ నాయకులు కరక దేముడు గారు,మడక బంగారు రాజు గారు, నీటిపల్లి మహేష్ గారు తదితర మండల అధికారులు ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు, కార్యకర్తలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు