విశాఖ రైల్వే జోన్ కల సాకారం.. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ప్రధాని Narendra Modi గారి ప్రభుత్వం
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసి, దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నెరవేర్చింది.
కొత్త రైల్వే జోన్ ముఖ్యాంశాలు:
* గుంతకల్లు, గుంటూరు, విజయవాడ, వాల్తేరును కలిపి మొత్తం 4 డివిజన్లతో కొత్త రైల్వే జోన్ పనిచేస్తుంది.
* విభజన చట్టంలో ఇచ్చిన ప్రత్యేక హామీని కేంద్రం నెరవేర్చింది.
* 2019లో జోన్ ప్రకటన చేసినప్పటి నుంచి డీపీఆర్ తయారీ, భూసేకరణ, కార్యాలయాల నిర్మాణం, జీఎం ఆఫీస్ ఏర్పాటు వంటివన్నీ పూర్తి చేసి అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ తీసుకువచ్చింది.
అసాధ్యం అనుకునే దానిని సుసాధ్యం చేయడం ఒక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికే సాధ్యం.
ఈ చారిత్రాత్మక నిర్ణయం ద్వారా రాష్ట్రంలో రైల్వే సేవలు, ఇతర మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడతాయి.
రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ Ashwini Vaishnaw గారికి BJP Andhra Pradesh తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు!