విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
మాజీ కార్పొరేటర్ విశాఖ పార్లమెంటు అధికార ప్రతినిధి విల్లురి భాస్కర రావు మాట్లాడుతూ
కూటమి ప్రభుత్వం పై మాజీ కార్పొరేటర్ గంగరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాము.
కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కనిపించడం లేదా.
రాజకీయ ఉనికి కోసం గంగరావు ఇటువంటి వాక్యాలు చేస్తున్నారు.
ప్రజలు చెల్లించే పన్నులు ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి.
పార్క్ లలో ఆసాంఘిక కార్యకలాపాలు అడ్డుకోవడానికి వాకర్స్ కు గుర్తింపు కార్డు ఇవ్వడానికె సంవత్సరానికి 720 వసూలు చేస్తున్నారు.
విశాఖ లో కూటమి ప్రభుత్వం చర్యలు వలన కాలుష్యం తగ్గుతుంది.
గత వైసీపీ ప్రభుత్వంలో విశాఖ లో అభివృద్ధి కుంటిపడినప్పుడు,
ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడలేదు.
పార్క్ లలో వాకర్స్ నుంచి వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు నిర్వహణ కోసం మాత్రమే.
*మాజీ కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు మాట్లాడుతూ*
గత వైసీపీ ప్రభుత్వం లో జీవీఎంసీ లో జరిగిన అరాచకాలు పై మాజీ కార్పొరేటర్ గంగారావు ఎందుకు మాట్లాడలేదు.
కూటమి ప్రభుత్వం విశాఖ అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది.
అనేక సంక్షేమ పథకాలు అందిస్తుంది.
మాకు 120 స్థానాలలో పోటీ చేయాలని అంటున్న మాజీ కార్పొరేటర్ గంగారావు వారి పార్టీ నుంచి 120 స్థనాలలో పోటీ చేయాలి.
సీఎం చంద్రబాబు నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజా పాలన అందిస్తున్నారు.
ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నాము.
మాజీ కార్పొరేటర్ గంగారావు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి.
కూటమి నాయకులను విమర్శించే స్థాయి గంగారావు కు లేదుఅని అన్నారు,