ఎర్త్ డే అంటే సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని చెప్పేది
– ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ముప్పు
– భూమి సమస్త జీవరాశి కీ సంబంధించిన ఆస్తి
– జీవుల గూడు లో మనిషి ఒక భాగం
– జెవి రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం
ఎర్త్ డే అంటే సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని ప్రతి ఒక్కరికీ తెలియపరిచే రోజు అని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం వివరించారు. బుధవారం ఉదయం మద్దిలపాలెం లో ఉన్న శ్రీ భావన విద్యా నికేతన్ లో ప్రిన్సిపాల్ షణ్ముఖ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన భూమి దినోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం ఇతివృత్తం “మన శక్తి, మన గ్రహం,” అన్నారు. భూమి మీద ఏ జీవి అంతరించినా మానవాళి మనుగడకే ముప్పు అని హెచ్చరించారు. భూమి సమస్త జీవరాశి కీ సంబంధించిన ఆస్తి అని, దానిని విశ్మరించి సాగిస్తూ ముందుకు వెళ్తున్న వారి వల్ల అందరికీ నష్టం ఏర్పడుతుంది అని వివరించారు. మనిషి జీవుల గూడు తయారు చేయలేదు అన్నారు. భూమి మీద ఉన్న జీవుల గూడు లో మనిషి ఒక భాగం అనే అంశం గుర్తుంచుకోవాలి అని కోరారు. ఇది పర్యావరణ పురోగతి కేవలం ప్రభుత్వాల పరిపాలనల ద్వారానే కాకుండా, వ్యక్తుల రోజువారీ చర్యలు, ఆవిష్కరణలు సామాజిక భాగస్వామ్యం ద్వారా కూడా సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. ఇది పునరుత్పాదక శక్తికి మారడం, స్థానిక చర్యలు తీసుకోవడంపై ఉద్ఘాటిస్తుందన్నారు.
శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సౌర, పవన శక్తి వంటి పునరుత్పాదక వనరుల వైపు మరల వలసి ఉందన్నారు. సమస్త జీవరాశినీ జివించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని కోరారు.
స్కంద పురాణంలో లేదు వ్యాస మహర్షి చెప్పిన విధంగా 27 మొక్కలు ప్రతి ఒక్కరూ నాటి పెంచాలని పిలుపునిచ్చారు. ప్రకృతి వనరుల పరిరక్షణ మన బాధ్యత అని గుర్తెరిగి వాటిని కాపాడుకోవాలి అని వివరించారు. పర్యావరణ సమస్యలను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలనే ప్రయత్నంలో, అమెరికా లోని సెనేటర్ గేలార్డ్ నెల్సన్ కార్యకర్త డెనిస్ హేస్‌ను సమన్వయకర్తగా నియమించడంతో, మొదటి భూమి దినోత్సవం 1970 ఏప్రిల్ 22న జరిగిందన్నారు. 1990లో, ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించి, 141 దేశాలలో 20 కోట్ల మంది ప్రజలను స్పందించింది అని వివరించారు. ప్రస్తుతం 190 కి పైగా దేశాల్లో భూమి దినోత్సవం నిర్వహిస్తున్నారని వివరించారు.
ఈ కార్యక్రమంలో పీపుల్స్ పవర్ భాస్కరరావు, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ సమన్వయకర్త ఐ కృష్ణ కుమారి, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు.
ఎర్త్ డే అంటే సమస్త జీవరాశినీ కాపాడుకోవాలి అని చెప్పేది #vvwnews
2
previous post