సీతారామ కళ్యాణ మహోత్సవము శ్రీ లక్ష్మీ టాకీస్ లో ఘనంగా నిర్వహించారు విశాఖపట్నం

by vvwnews.com

విశాఖపట్నం వన్ టౌన్ లక్ష్మీ టాకీస్ వద్ద గల శ్రీ విజయ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో
శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచి స్థానిక భక్తులు ఆలయానికి పోటెత్తారు. శ్రీ సీతారాముల విగ్రహాలను అలాగే శ్రీ విజయ ప్రసన్నాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు చేసారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై శ్రీ సీతారాముల కళ్యాణమహోత్సవాన్ని తిలకించారు. దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌, ఇతర కూటమి నాయకులు వైసిపి నాయకులు ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. స్వామి వారి కళ్యాణమహోత్సవం అనంతరం సుమారు 2 వేల మంది భక్తులకు అన్న ప్రసాద వితరణ చేసారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఇళ్ల రాజు మాట్లాడుతూ 26 ఏళ్ల కిందట శ్రీ విజయ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ భూగర్భంలో లభించిందని నాటి నుంచి ఏటా క్రమం తప్పకుండా శ్రీ రామనవమి వేడుకలను జరుపుకుంటూ వస్తున్నట్టు చెప్పారు. ఆయా హిందూ పండుగల సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్న ప్రసాదవితరణ చేపడుతున్నట్టు తెలిపారు. ప్రతి శనివారం, మంగళవారం 200 మందికి అన్నదానం చేస్తున్నామని, నిత్య అన్నదానం చేయాలన్నది తమ సంకల్పంగా చెప్పారు.

Use Social Media to Spread the Word about Our News

related articles