పసుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచండి
– 20 వేలు మట్టి పాత్రలు ఏర్పాటు కు కృషి చేస్తున్నాం
– వన్యప్రాణులు వేటగాళ్ల బారిన పడకుండా చర్యలు చేపట్టాలి
– ప్రభుత్వం స్పందించి పశుపక్ష్యాదులకు నీటి వసతి కల్పించాలి
– జెవి రత్నం, వ్యవస్థాపక కార్యదర్శి, గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ
పసుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచండని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జి ఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం పిలుపునిచ్చారు. బుధవారం ఉదయం విశాఖపట్నం జిల్లా ఎంవిపి కాలనీ లోని ఆళ్వార్ దాస్ డిగ్రీ కళాశాల మైదానంలో ప్రిన్సిపాల్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన పశుపక్ష్యాదులకు నీరు మట్టి పాత్రలలో ఏర్పాటు చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఏడాది పసుపక్ష్యాదులకు నీరు ఏర్పాటు చేయడానికి 20 వేలు మట్టి పాత్రలు ఏర్పాటునకు కృషి చేస్తున్నాం అన్నారు. దేశం లో ప్రతి ఒక్కరూ స్పందించి పశుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచాలని కోరారు. సమస్త జీవరాశిని కాపాడుకుందామన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు స్పందించి పశుపక్ష్యాదులకు నీటి వసతి కల్పించాలని కోరారు. విశాఖపట్నం జిల్లా అధికారులు కూడా స్పందించి పశుపక్ష్యాదులకు నీటి వసతి కల్పించాలని కోరారు. పక్షులు కోసం చిరుధాన్యాలు అందుబాటులో ఉంచాలని కోరారు. అడవుల్లో, కొండల మీద, తీర ప్రాంతాలలో వర్షాకాలంలో చిరుధాన్యాలు చల్లి పశుపక్ష్యాదులకు ఆహారం అందుబాటులోకి తీసుకు రావాలని కోరారు. వేసవి కాలంలో నీటి కోసం అడవి నుండి బయటకు వచ్చే వన్యప్రాణుల వేటగాళ్ల బారిన పడకుండా, వేట జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో మ్యాంగో మేన్ అప్పాజీ, స్వాంతన సేవా సంస్థ ప్రతినిధి ప్రజ్ఞాన్ కుమార్, గ్రీన్ క్లైమేట్ టీం వాలంటీర్ జె రాజేశ్వరి, పలువురు లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొని మాట్లాడారు.
పసుపక్ష్యాదులకు నీరు అందుబాటులో ఉంచండి #vvwnews
5
previous post