యుద్ధం వద్దు శాంతి ముద్దు
ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ ఏకపక్ష బాంబు దాడులను ప్రజలు వ్యతిరేకించండి జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి పిలుపు అమెరికన్ సామ్రాజ్యవాదం గల్ఫ్ దేశాల చమురు ఆయిల్ ఆదిపత్యం కోసం గత నాలుగు రోజులుగా ఇరానపై జరుగుతున్న యుద్దాలను వెంటనే ఆపాలని కోరుతూ తేదీ 4- 3- 2026 ఉదయం 8:30 కి ఇసుకతోట జంక్షన్ వద్ద అసంఘటితరం కార్మికులు నిరసన ధర్నా చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్ ఎఫ్ ఐ ఆర్ టి డబ్ల్యు నేషనల్ ఫెడరేషన్ ఆప్ ఇండియన్ రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ జాతీయ వర్కింగ్ కమిటీ సభ్యులు జి వామనమూర్తి మాట్లాడుతూ
ఒక స్వతంత్ర దేశమైన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ బాంబు దాడులు చేస్తూ ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని హరిస్తూ, ఇరాన్ దేశాధ్యక్షుడిని, కుటుంబం మొత్తాన్ని హత్య చేయడాన్ని ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నేడు జరుగుతున్నది యుద్ధం ప్రజలపై భారాలు మోపే యుద్ధం తప్ప ప్రజల మేలు కోసం జరిగేది కాదని ఆందోళన వ్యక్తం చేశారు అమెరికా అనేక దేశాలపై దాడులు చేస్తూ తన యుద్ధ సామాగ్రి వ్యాపార సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో దుర్మార్గంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. లిబియా, ఇరాక్, గాజా తదితర అనేక దేశాలపై అధర్మ యుద్దాలు చేస్తున్నదని మండిపడ్డారు . ఆయిల్ సంపదను దోచుకునే లక్ష్యంతో అమెరికా సాగిస్తున్న ఈ దుర్మార్గ దాడులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమయంలో భారతి ప్రధాని మంత్రి మోడీ ప్రభుత్వం ఇజ్రాయెల్ తో ఒప్పందాలు చేసుకోవడం దుర్మార్గమని విమర్శించారు. సామ్రాజ్యవాద యుద్దాన్ని ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న సామ్రాజ్యవాద అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజల ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇఫ్టూ అధ్యక్షులు కె పోలారి మాట్లాడుతూ ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ సైనిక దాడులను భారత పాలకులు వ్యతిరేకించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రావి కృష్ణ ఎం రమణ