గీతం 21 నుంచి సౌత్ జోన్ చదరంగం పోటీలు400 మంది మహిళా క్రీడాకారుల రాక l vvw news

by vvwnews.com

గీతం 21 నుంచి సౌత్ జోన్ చదరంగం పోటీలు
400 మంది మహిళా క్రీడాకారుల రాక
అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) ఆధ్వర్యంలో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వేధికగా
..ఫిబ్రవరి 21 నుంచి 23వ తేదీ వరకు దక్షిణ మండల (సౌత్ జోన్) అంతర్ విశ్వవిద్యాలయాల మహిళల చదరంగం
(చెస్) పోటీలను నిర్వహిస్తున్నట్లు గీతం కేంపస్ లైఫ్ అసోసియేట్ డీన్ అరుణ్ కార్తీక్ తెలియజేశారు. గీతం విశ్వవిద్యాలయంలో
శుక్రవారం తేది: 20-02-2026న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన పోటీలకు సంబంధించిన వివరాలను
వెల్లడించారు. గీతంలో జరిగే సౌత్ జోన్ చదరంగం (మహిళలు) పోటీలకు దక్షిణ భారత దేశంలోని 80విశ్వవిద్యాలయాల
నుంచి 400 మంది చదరంగం క్రీడాకారిణులు పోటీలలో పాల్గొంటారని తెలిపారు. పోటీలకు అత్యధికంగా కర్ణాటక
నుంచి 31 జట్లు, తమిళనాడు నుంచి 19 జట్లు, ఆంధ్రప్రదేశ్ నుంచి 19 జట్లు, తెలంగాణా నుంచి 8, కేరళ నుంచి 7
జట్లు చొప్పున, పాండిచ్చేరి నుంచి 2 జట్లు పాల్గొంటున్నాయని తెలిపారు.
ఈ పోటీలలో పలువురు గ్రాండ్ మాస్టర్లు, అంతర్జాతీయ మాస్టార్లు, ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (ఎఫ్ఎడిఇ)
రేటెడ్ క్రీడాకారిణిలు పాల్గొనున్నారని తెలిపారు. గీతం నుంచి ఇద్దరు ఫెడరేషన్ రేటెడ్ క్రీడాకారిణులు పోటీలలో పాల్గొంటారని
వెల్లడించారు.
గత ఏడాది విజేతలుగా నిలిచిన మద్రాసు విశ్వవిద్యాలయం, అన్నా విశ్వవిద్యాలయం, భారతీయార్ విశ్వవిద్యాలయం,
ఎస్ఆర్ఎమ్ విశ్వవిద్యాలయం ఈ జట్లు చెస్ వరల్డ్ ర్యాంకింగ్ క్రీడాకారిణిలు, దాదాపు 50 మంది కోచ్లు, మేనేజర్లు
ఈపోటీలకు హజరవుతున్నారని తెలిపారు. పోటీలకు ఛీఫ్ ఆర్బిట్రేటర్ గా జి.వి.కుమార్, సహయ ఆర్బిట్రేటర్లుగా
ప్రసాద్, శ్రీకాంత్లు వ్యవహరిస్తారని పేర్కొన్నారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ
పోటీలకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేశామన్నారు. విలేకరుల సమావేశంలో గీతం క్రీడా విభాగం డిప్యూటీ డైరక్టర్
ఎన్. శ్రీనివాస్, గీతం క్రీడా విభాగం సీనియర్ మేనేజర్ కె. తపశ్వి తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles