పత్రికా ప్రకటన
టీ.సి.సి.ఎల్ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు సన్నాహాలు పూర్తి.
విశాఖలో ఫిబ్రవరి 28 & మార్చి 1 న తెలుగు సెలబ్రిటీ క్రికెట్ లీగ్ క్రికెట్ సంబరాలు.
విశాఖపట్నం నగరంలో ఫిబ్రవరి 28 మరియు మార్చి 1 తేదీలలో నిర్వహించబడనున్న టీ.సి.సి.ఎల్ (TCCL) క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ఈ రోజు నిర్వహించిన పత్రికా సమావేశం విశాఖపట్నంలో హోటల్ మేఘాలయలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గంట శ్రీనివాసరావు దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, కంకటాల మల్లిక్, పైడా కృష్ణ ప్రసాద్, నిర్వాహక ప్రధాన కర్త కాశి, తెలంగాణ డిఎస్పి సర్లాన రాంబాబు లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ విశాఖపట్నం క్రీడా రంగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన నగరమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రికెట్ మ్యాచ్లు, ఐపీఎల్ పోటీలు నిర్వహించిన అనుభవం విశాఖకు ఉందని, ఇప్పుడు టీ.సి.సి.ఎల్ మ్యాచ్ల ద్వారా మరొకసారి నగరం క్రీడా వేదికగా వెలుగొందబోతోందని పేర్కొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్లు టాలీవుడ్ సెలబ్రిటీస్ సామాజిక బాధ్యతతో పేదవారికి చారిటీ కోసమై నడుం బిగించి విశాఖ నగర ప్రజలను క్రికెట్ అభిమానులను అలరించనున్నారన్నారు.క్రీడలు యువతకు శారీరక దృఢత్వం మాత్రమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు జట్టు భావనను పెంపొందిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ మ్యాచ్ల ద్వారా స్థానిక క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయని శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
టీ.సి.సి.ఎల్ నిర్వాహకులు సర్లాన రాంబాబు మాట్లాడుతూ, రెండు రోజుల పాటు జరిగే ఈ పోటీలలో 7 వివిధ కార్పొరేట్ జట్లు పాల్గొంటున్నాయని, అందులో సినీ యాక్టర్లు శ్రీకాంత్, తరుణ్ ,తమన్, సుధీర్ బాబు ,ఓంకార్, తదితరులు రెండు టీములుగా అలాగే టీవీ యాక్టర్లు రెండు టీములుగా , ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు , పోలీస్ అసోసియేషన్ లు కలిసి టీములుగా ప్రేక్షకులకు ఉత్కంఠభరితమైన మ్యాచ్లు విశాఖపట్నం ఏ సి ఏ- విడి సి ఏ క్రికెట్ స్టేడియంలో అందించనున్నట్లు చెప్పారు. ఈ క్రికెట్ మ్యాచ్ లు పూర్తిగా పేద క్రీడాకారులకు, చారిటీ కోసం, ముఖ్యమంత్రి సహాయ నిధి కొరకు కళాకారులు క్రికెట్ మ్యాచ్ లో పాల్గొంటున్నారన్నారు. ఇప్పటికే హైదరాబాదులో హీరో శ్రీకాంత్ తదితరుల ఆధ్వర్యంలో పత్రికా సమావేశంలో క్రికెట్ మ్యాచ్ లకు సంబంధించి జెర్సీలను ఆవిష్కరించడం జరిగింది. క్రీడాభిమానులు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
విశాఖపట్నం నగరం ఎప్పుడూ క్రీడా ఉత్సవాలకు ఆదరణ చూపుతుందని, ఈ కార్యక్రమం కూడా అదే ఉత్సాహంతో సాగుతుందని నిర్వాహకులు విశ్వాసం వ్యక్తం చేశారు.