ప్రెస్ నోట్..13/02/2026 *AU*
*ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF)*
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయాలి– AISF
*ప్రైవేట్ పిజి విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేయాలి.* –AISF
ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజుల దోపిడీ అరికట్టాలి.– AISF
*ప్రవేట్ యూనివర్సిటీల ఫీజుల దోపిడీకి మద్దతు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం*– AISF
ఈ రోజు రాష్ట్ర సమితి తెలుగులో భాగంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన ద్వారం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా *ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం. నాగరాజు* మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ యూనివర్సిటీలలో 3480 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ , అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న కూడా ఇంతవరకు పోస్టులు భర్తీ చెయ్యకుండా యూనివర్సిటీల అభివృద్ధికి కృషి చేయకపోవడం బాధాకరమన్నారు.ఒక్క ఆంధ్ర యూనివర్సిటీలోనే 726 ప్రొఫెసర్ , అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్ట్ లు ఖాళీ ఉన్నాయన్నారు. తక్షణమే పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేట్ పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77 రద్దు చేసి ఆ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయిలో రియంబర్స్మెంట్ వచ్చేలా చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు మాట తప్పుతున్నారని విమర్శించారు. ఈ ఎన్ డి ఏ ప్రభుత్వం ప్రభుత్వ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని వీళ్ళు పూర్తిస్థాయిలో ప్రైవేట్ యూనివర్సిటీలకు కొమ్ముకాస్తున్నారని అందులో భాగంగానే మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజులు దోపిడీ నియంత్రించకపోవడం అలాగే గీతం యూనివర్సిటీకి ప్రభుత్వ ఆస్తి అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి సహకరించి ప్రైవేట్ యూనివర్సిటీలో ఫీజులతో ఒకటి అరికట్టాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన సిద్ధమవుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ యూనివర్సిటీ కార్యదర్శి అభిషేక్, సహాయ కార్యదర్శి హేమానందం, ఏయూ ఉపాధ్యక్షురాలు కంజీర, నాయకులు ఆదర్శ్, శివరాజ్, ప్రసన్న , వికాస్, రమేష్ విద్యార్థులు పాల్గొన్నారు