శ్రీరామ రజక సంక్షేమ సేవా సంఘం 14 వ వార్డు రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బల్లల పండుగ

by vvwnews.com

శ్రీరామ రజక సంక్షేమ సేవా సంఘం 14 వ వార్డు రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బల్లల పండుగ మహోత్సవం వైభవంగా జరిగింది. బాలయ్య శాస్త్రి లేఔట్, ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ముందుగా రజక వృత్తికి కీలకమైన బట్టలు ఉతికే బల్లలను పూజించారు. ఆ గంగమ్మ తల్లికి పూజలు చేసి తమ మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలోనే తమ బంధువులను సైతం ఈ పండుగకు పిలిచి తమ కులవృత్తులను భావితరాలకు గుర్తుండేలా చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని శ్రీరామ రజక సంక్షేమ సేవా సంఘం సభ్యులు తెలిపారు. విచిత్ర వేషధారణలు, కోలాటాలు కూడా ఈ వేడుకలో ఆకట్టుకున్నాయి. రాష్ట్ర రజక జన సేవా సంఘం అధ్యక్షులు అక్కినపల్లి లక్ష్మయ్య, టీడీపీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, రాజమండ్రి నారాయణ, ముత్యాల హరిత, చీపురుపల్లి వెంకట సత్య స్వరూప్, సత్తిబాబు మాట్లాడిన వారిలో ఉన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles