4
జీవీఎంసీ 53 వ వార్డు టిడిపి సీనియర్ నాయకులు పోలమరశెట్టి శ్రీనివాసరావు జన్మదిన వేడుకలు మర్రిపాలెంలోని ఆయన స్వగృహంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువత పాల్గొని రక్తదానం చేశారు. ఏపీ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండి బాబ్జి మాట్లాడుతూ.. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ.. ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పొలమరిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. తన పుట్టినరోజు వేడుకలకు విచ్చేసి, తనకు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా యువత విచ్చేసి రక్తదానం చేయడం తనకు చాలా ఆనందదాయకమని అన్నారు.