విశాఖపట్నం తీరప్రాంతంలో విలాసానికి మరో దిక్సూచి#vvwnews

by vvwnews.com

విశాఖపట్నం తీరప్రాంతంలో విలాసానికి మరో దిక్సూచి
విశాఖపట్నం 4 ఫిబ్రవరి 2026: స్థానిక బీచ్ రోడ్ లోని పార్క్ హోటల్ ప్రాంగణంలో వినోదవిలాసాలకు సరికత్త దిక్సూచిగా ది లైట్ హౌస్ బార్ ను ఈరోజు ఆవిష్కరించినది. సమీప కాలం చెల్లిన లైట్ హౌస్ తీర ప్రాంత జ్ఞాపకాలకు గుర్తుగా సమకాలీన హంగులతో అందమైన సాయంత్రాలను సముద్రాల అలల సోయగాలు మెలికలు తిరిగే శృంగారాన్ని ప్రతిబింబించునట్లు ది లైట్ హౌస్ బార్ సూర్యాస్తమయం అనంతరం అద్భుతమైన మనసును ఆహ్లాదపరిచే అనుభూతులు అందించు విధంగా రూపకల్పన చేసారు.
ది లైట్ హౌస్ బార్ తీరప్రాంత సంబంధిత విశేషాలను, నావికా సంబంధిత అలంకరణలు అందిపుచ్చుకుని సహజంగా, అందంగా, ఆహ్లాదకర వాతావరణం, వీనులకు విందు చేసే సుమధుర వాయిద్య సంగీతం, సువిశాలమైన ప్రదేశం అతిధులను ఆనంద డోలికలలో ఓలలాడిస్తుంది. వారికి ప్రశాంతమైన మానసిక ఉల్లాసం కలిగిస్తుంది.
ది లైట్ హౌస్ బార్ ప్రతి మూల కళాత్మకతను మరియు స్థానిక సంస్కృతులను చాటిచెపుతాయి. ఇక్కడి కాక్ టెయిల్ కార్యక్రం ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉంటుంది. ఈ పానీయంను వృక్ష సంబందిత పదార్థాలు, సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి, బెల్లం, వైట్ టీ వంటి వాటితో తయారు చేసి అందిస్తారు. ప్రతి కాక టెయిల్ ఒక విభిన్నమైన మధుర రుచులను కలిగి ఉంటాయి.అందరి అభిరుచులకు అనుగుణంగా అంతర్జాతీయ నైపున్యతలు కలిగి ఉంటాయి.
ది లైట్ హౌస్ బార్ నకు అనుబంధంగా భారతీయ స్టార్టర్ల మెనూ ఏర్పాటు చేసారు. ఈ వంటకాకాలు ఘాటైన రుచులు అధునాతన మెళకువలు మేళవించి తయారు చేసినవి. ఇది ఆధునిక విలాసానికి ఒక గమ్యస్థానం అవుతుంది.
ది లైట్ హౌస్ బార్ కేవలం ఒక నైట్ లైఫ్ కంటే అధికమైన అనుభూతులను ఆనందాన్ని పంచుతుంది. చక్కని రుచులు మరియు ప్రత్యేకమైన పానీయాలు తోటి స్థానికులకు, పర్యాటకులకు, ప్రయాణికులకు ఒక సమావేశ వేదికగా ఆకర్షణీయ గమ్యస్థానం అవుతుంది. విశాఖ తీరంలో సరికొత్త కాంతులను వెదజల్లే మార్గదర్శి గా అలరారుతుంది ది లైట్ హౌస్ బార్.

టేబుల్ రిజర్వేషన్ కొరకుసంప్రదించండి : సాదిక్, ఫోన్ 9959611757, 0891-6825678

Use Social Media to Spread the Word about Our News

related articles