పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు నూతన బ్రాంచ్‌ల ప్రారంభం
సీతమ్మధార, యెండాడ ప్రాంతాల్లో సేవల విస్తరణ
విశాఖపట్నం:
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) విశాఖపట్నం సర్కిల్ పరిధిలోని సీతమ్మధార మరియు యెండాడ ప్రాంతాల్లో రెండు నూతన బ్రాంచ్‌లను ఘనంగా ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ జోనల్ మేనేజర్ శ్రీమతి వందనా పాండే ముఖ్య అతిథిగా పాల్గొని బ్రాంచ్‌లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ హెడ్, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఆనంద్ కుమార్ గారు ఇతర బ్యాంకు అధికారులు, సిబ్బంది హాజరయ్యారు.
సీతమ్మధార బ్రాంచ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ విశాఖపట్నం సర్కిల్‌లో 68వ బ్రాంచ్‌గా, యెండాడ బ్రాంచ్ 69వ బ్రాంచ్‌గా ప్రారంభమైంది. విశాఖపట్నం సర్కిల్ పశ్చిమ గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లా కేంద్రాలను కవర్ చేస్తూ గ్రామీణ, అర్ధనగర, నగర ప్రాంతాల్లో విస్తృత సేవలను అందిస్తోంది.
ఈ సందర్భంగా జోనల్ మేనేజర్ శ్రీమతి వందనా పాండే మాట్లాడుతూ, ప్రతి పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్‌లో రిటైల్, అగ్రి, MSME (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు) సంబంధిత అన్ని బ్యాంకింగ్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. బ్యాంక్ ఉత్పత్తులన్నీ డిజిటలైజ్ చేయబడి, పీఎన్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రానున్న 132వ స్థాపన దినోత్సవం (ఏప్రిల్ 12, 2026) నాటికి డిజిటల్ లెండింగ్‌లో రూ.1 లక్ష కోట్ల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంక్ కృషి చేస్తోందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు విజయవాడ, విశాఖపట్నం అనే రెండు సర్కిళ్లు ఉన్నాయని ఆమె వివరించారు. నూతన ప్రభుత్వ పాలనలో అమరావతి, విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలుగా ఎదుగుతున్నాయని, ఈ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవల విస్తరణకు పీఎన్‌బీ పూర్తి స్థాయిలో సహకరిస్తుందని అన్నారు.
సర్కిల్ హెడ్ శ్రీ ఆనంద్ కుమార్ నాయకత్వంలో విశాఖపట్నం సర్కిల్ జోన్ స్థాయిలో అగ్రస్థానంలో, దేశవ్యాప్తంగా రెండో స్థానంలో నిలుస్తూ విశేష ప్రగతి సాధిస్తోందని బ్యాంక్ అధికారులు తెలిపారు. నూతన బ్రాంచ్‌ల ద్వారా స్థానిక ప్రజలకు మరింత సమర్థవంతమైన, ఆధునిక బ్యాంకింగ్ సేవలు అందించడమే లక్ష్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముందుకు సాగుతోందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సీతమ్మధార బ్రాంచ్ మేనేజర్ కాశీ విశ్వనాథ్ మరియు ఎండాడ బ్రాంచ్ మేనేజర్ ధర్మేంద్ర సురే డిప్యూటీ హెడ్ సర్కిల్ మనోజ్ సేతు మరియు బ్యాంక్ ఆఫీసర్ సెక్రెటరీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండు నూతన బ్రాంచ్‌ల ప్రారంభం !! #vvwnews
6