కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలి #vvwnews

by vvwnews.com

కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలి
– ఆవ పరీవాహక ప్రాంతంలో ప్రకృతి ఆధారంగా పంటలు పండించాలి
– ఇళ్ళ వ్యర్ధాలు ఆవ లోనికి రానీయకూడదు
– ఆవలో ఆక్రమణలు తొలగించాలి
– బొలిశెట్టి సత్యన్నారాయణ, రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి, జనసేన
కొండకర్ల ఆవను పర్యావరణ హితంగా ఉంచాలి అని జనసేన పార్టీ రాష్ట్ర పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం సందర్భంగా సోమవారం ఉదయం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం కొండకర్ల ఆవను సందర్శించిన తర్వాత ఆయన ప్రజలతో మాట్లాడారు. ఆవ విస్తీర్ణం సుమారు 1,863 ఎకరాలను పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిది, దాని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న ప్రజలదీ అన్నారు. అలాగే ఆవ పరీవాహక ప్రాంతం సుమారు 2,538.19 హెక్టార్లలో ప్రకృతి ఆధారంగా పంటలు పండించేలా ప్రభుత్వం కృషి చేయాలి అని కోరారు. ఇళ్ళ నుండి , గ్రామాలు, పట్టణాలు, పారిశ్రామిక వ్యర్ధాలు ఆవ లోనికి రానీయకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఆవలో ఆక్రమణలు తొలగించాలని , కొత్త ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. అనకాపల్లి జిల్లాలోని ఈ కొండకర్ల ఆవ ఆంధ్రప్రదేశ్‌లో కొల్లేరు సరస్సు తర్వాత రెండవ అతిపెద్ద సహజ మంచినీటి సరస్సుగా దీనికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. అచ్యుతాపురం, మునగపాక మండలాల్లో విస్తరించి ఉన్న ఈ సరస్సును వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా “సంరక్షిత ప్రాంతం”గా ప్రకటించిందని అన్నారు.”ఆవ” అంటే తెలుగులో చిత్తడి నేల లేదా సరస్సు అని అర్థం. ఇది కేవలం నీటి వనరు మాత్రమే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలకు వరద ముప్పును తగ్గించే సహజ సంతులన కర్త అని కొండకర్ల ఆవ అత్యధికంగా కార్బన్ డయాక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ను విడుదల చేస్తుందని వివరించారు. మనిషికి కిడ్నీ ఎంత ముఖ్యమో భూమికి ఈ ఆవ అంత ముఖ్యమైనది అని పేర్కొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles