రాజయ్యపేట గ్రామస్తులు చాలా మంచివాళ్ళు. హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు

by vvwnews.com

*అనకాపల్లి జిల్లా*

*నక్కపల్లిలో మీడియాతో మాట్లాడిన హోం మంత్రి అనిత*

16 రోజులుగా రాజయ్యపేట గ్రామంలో బల్క్ డ్రగ్ కోసం ధర్నా చేస్తున్నారు.

నన్ను రాజయ్యపేట గ్రామం రావాలని గ్రామస్తులు కోరారు.

అసెంబ్లీ సమావేశాలు అయిన వెంటనే వస్తానని చెప్పాను.

ఒకరోజు ముందుగానే రాజయ్యపేట వచ్చాను.

బయట నుండి వచ్చిన వ్యక్తులు కూడా వచ్చారు.

బయటనుండి వచ్చిన వ్యక్తులు రచ్చగొడతున్నారు.

రాజయ్యపేట గ్రామం టిడీపి కంచుకోట.

2014,2019,2024 ఎన్నికల్లో కూడా అత్యధిక మెజార్టీటి ఇచ్చారు.

2024 ఫిబ్రవరిలో వైసీపీ ప్రభుత్వం వర్చువల్ గా శంకుస్థాపన చేశారు.

అప్పటి వైసీపీ నాయకులు పాలాభిషేకాలు చేశారు.

ఎన్డియే ప్రభుత్వం లో మోదీ విశాఖలో మరల శంకుస్థాపన చేశారు.

హెటిరో కంపెనీ వలన రాజయ్యపేట గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

రాజయ్యపేట గ్రామస్తులు అన్ని పార్టీలు నాయకులు,ప్రజలతో ఒక కమీటి ఏర్పాటు చేయాలని చెప్పాను.

సీఎం,డిప్యూటి సీఎం వద్దకు తీసుకువెళ్తానని చెప్పాను.

రాజయ్యపేట ప్రజలు కోరిక మేరకు బల్క్ డ్రగ్ పార్క్ పనులు ఆపిచేయిస్తానని చెప్పాను.

మత్స్యకారులతో దయచేసి రాజకీయాలు చేయవద్దు.

మత్స్యకారులకు వేట నిషేద సమయంలో మత్స్యకార సేవలో పేరుతో 20 వేల రూపాయలు ఇచ్చాం.

మత్స్యకారులకు 50 సంవత్సరాలకే ఫించన్ ఇచ్చిన ఘనత చంద్రబాబుది.

రాజయ్యపేట గ్రామస్తులు చాలా మంచివాళ్ళు.

బయటనుండి వచ్చేవాళ్ళు రచ్చగొడతున్నారు.

అమాయకులైన ప్రజలతో రాజకీయాలు చేయవద్దు.

పోలీసులు ఎవ్వరైనా అనుచితంగా ప్రవర్తిస్తే,పోలీసులు తరుపున నేను క్షమాపణ కోరాను.

నేను మరల రాజయ్యపేట ప్రజలతో మాట్లాడుతాను.

ఎవ్వరు ఆకలితో ఉండకూడదు..అదే ఎన్డియే లక్ష్యం.

పాయకరావుపేట నియోజకవర్గంలో స్టీల్ ఫ్లాంట్ ను అందరు స్వాగతం పలికారు.

రాజయ్యపేట ప్రజలకు నేను ఎప్పుడు న్యాయమే చేస్తాను.

సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెలతాం.

రాజయ్యపేట గ్రామస్తులు అందరు దయచేసి నా మాట వినండి.

Use Social Media to Spread the Word about Our News

related articles