ఆంధ్ర ప్రదేశ్ పోర్ట్ ల అభివృద్ధికి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

by vvwnews.com

*ఆంధ్ర ప్రదేశ్ లో పోర్ట్ ల అభివృద్ధికి కృషి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*ఒరిస్సాలో పారాదీప్, గోపాలపురం పోర్ట్ లకు దీటుగా మూలపేట, విశాఖపట్నం పోర్ట్ లు అనుసంధానం చేయాలని కోరిన ఎమ్మెల్యే*

*ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్ అభివృద్ది పై ప్రత్యేక కార్యచరణ చేపట్టాలన్న ఎమ్మెల్యే*

*విశాఖ- రాయపూర్ హైవేను త్వరితగతిన పూర్తి చేయాలని కోరిన ఎమ్మెల్యే*

*విశాఖ పోర్టుకు పూర్వ వైభవం కల్పించాలని కోరిన ఎమ్మెల్యే*

గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలన తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధ్యం అవుతుందని, ముఖ్యంగా ట్రాన్స్ పోర్ట్, లాజిస్టిక్స్ రాష్ట్ర అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తాయని, సముద్ర తీర ప్రాంతం అధికంగా ఉన్న విశాఖ నగరానికి పోర్ట్ పరంగా ఒరిస్సా పోర్ట్ అంతగా అభివృద్ధి చెందలేదని తెలిపారు. గతం లో ఒరిస్సా పారదీప్ పోర్ట్ లో 20 వేల టన్నులు లోడ్ కాగా విశాఖపట్నం పోర్ట్ లో 50 వేల టన్నులు లోడ్ చేసేదని ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా మూడు లక్షల టన్నులను పారదీప్పోర్ట్లో లోడ్ చేస్తే మనం రెండు లక్షల 50,000 టన్నులు లోడ్ చేస్తున్నామని తెలిపారు. దానికి కారణం ఆ ప్రాంతంలో రోడ్లు, పోర్ట్ లు అభివృధి అవుతున్నాయని, మరోపక్క ఒరిస్సా లో గోపాలపురం పోర్ట్ కూడా అభివృద్ధి చెందడం తో మనకు రావాల్సినటువంటి ఐరన్ ఓర్, కోల్ మనకు రాకుండా మొత్తం అంతా పారాదీప్, గోపాలపురం తరలిపోతున్నాయని వ్యక్తం చేశారు. దీనికి కారణం ట్రాన్స్ పోర్ట్ రేట్లు తగ్గుదల అని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రివర్యులు, కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు ఎక్స్ప్రెస్ హైవే త్వరగా పూర్తయినట్లయితే చాలావరకు లాజిస్టిక్స్ రేట్స్ తగ్గి, మనకు రావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మూలపేట పోర్టు చుట్టుపక్కల లాజిస్టిక్ పార్క్స్ ను అభివృద్ధి చేయడం ద్వారా పెద్దపెద్ద సంస్థలు ముందుకు వస్తాయని తెలిపారు. ప్రత్యేకంగా పోర్ట్ ల అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. అదేవిధంగా విశాఖపట్నం పోర్టు ఏడు సంవత్సరాల క్రితం మొదటి స్థానంలో ఉండేదని, ప్రస్తుతం కాండ్ల పోర్ట్ మొదటి స్థానంలో ఉండగా, రెండో ప్లేస్ పారాదీప్ ఉందని, విశాఖపట్నం పోర్టు ఆరో ప్లేస్ కి వెళ్లిపోయిందని తెలిపారు. తగినంత మినరల్ మైన్స్ మన దగ్గర లేకపోవడం, ఒరిస్సా, ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్ లో ట్రాన్స్ఫర్ రేట్లు తగ్గడం వల్ల ఆయా పోర్టు వైపుకు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. రోడ్లు, లాజిస్టిక్స్ అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా కోరారు. డస్ట్ లేని కార్గోను విశాఖపట్నం పోర్ట్ కు, డస్ట్ తో కూడిన కార్గో ను మూలపేట పోర్ట్ తరలించే విధంగా చర్యలు చేపట్టాలని,మూలపేటకు విశాఖపట్నం కలిసి పనిచేసే విధంగా చర్యలు చేసుకోవాలని కోరారు. ఒరిస్సా పోటీకి తగిన విధంగా ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, రోడ్లు లాజిస్టిక్స్ అభివృద్ధి చేసినట్లయితే భవిష్యత్తులో ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పోర్ట్ లు కీలక పాత్ర వహిస్తాయని అసెంబ్లీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు ప్రస్థావించారు

Use Social Media to Spread the Word about Our News

related articles