*పత్రికా ప్రకటన*
*జిఎస్టి రేట్ కట్ పై అందరికి అవగహన కల్పించాలి*
*జిల్లా కలెక్టర్ ఎం. ఎస్. దినేష్ కుమార్*
పాడేరు, సెప్టెంబర్ 26:జిఎస్టి రేట్ కట్ పై అందరికి అవగహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఎం. ఎస్. దినేష్ కుమార్ అన్నారు.
జిఎస్టి రేట్ కట్ పై అవగహన కార్యక్రమానికి సంబంధించి శుక్రవారం గిరిజన జిల్లా సమాఖ్య కార్యాలయం నుండి ర్యాలీ జిల్లా కలెక్టర్, ఐ.టి.డి.ఏ ప్రాజెక్ట్ అధికారి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో తీసుకువెళ్లడానికి ముఖ్యంగా జిఎస్టి రేట్ కట్ చేయడం శుభపరిణామం అన్నారు.
దాదాపుగా ఎనిమిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయం ప్రజల కోసం వదిలి ప్రజలకి సేవింగ్ పెరగడానికే ఈ కార్యక్రమం అన్నారు. పాడేరులో ఉన్న మహిళలతో ఉంటున్న కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ తో ఇక్కడ ర్యాలీ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. ప్రజలకి ఈ జిఎస్టి 20 వలన వచ్చిన రేట్ కట్ గురించిన విషయాలపై అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమం వలన ప్రజలకు ఉపయోగం ఏంటి ఈ రేట్ కట్ సెప్టెంబర్ 22 నుంచి అమలుకు వచ్చిన విషయాలు కూడా ప్రజలకు చెప్పాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఏఏ ఐటమ్స్ దీనికి ముందు అధిక ధరల్లో అధిక పర్సంటేజ్ ఆఫ్ జిఎస్టి లో పెట్టిన ధరలు సెప్టెంబర్ 22 నుంచి కొత్త స్లాబ్ కి వచ్చిన రేట్ కి అమ్మాలి అనే విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలన్నారు.
ఈ అవగాహనా ర్యాలీలో ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి తిరుమణి శ్రీపూజ, సహాయ కలెక్టర్ సాహిత్, డి ఆర్ డి ఏ ప్రాజెక్ట్ అధికారి వి మురళీ, జిఎస్టి నోడల్ అధికారి పద్మజా వివిధ శాఖల అధికారులు ఉన్నారు.