IIH ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ జూమ్ సదస్సు LV PRASAD HOSPITAL

by vvwnews.com

ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ జూమ్ సదస్సు
విశాఖపట్నం 24 సెప్టెంబర్ 2025: LV ప్రసాద్ నేత్ర వైద్యశాల, G M R వరలక్ష్మి క్యాంపస్, విశాఖపట్నం వద్ద సెప్టెంబర్ నెల ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (IIH) అవగాహన మాసోత్సవాన్ని పురస్కరించుకుని, ఈరోజు (25సెప్టెంబర్2025) సాయంత్రం 4.30 గంటలకు అవగాహన కార్యక్రమాన్ని నిపుణులు ద్వారా జూమ్ సెషన్ నిర్వహిస్తున్నారు. జూమ్ సదస్సు లో పాల్గొనుటకు ఐడి: 4068102633 పాస్ వర్డ్ : LVPEI@2025. వ్యక్తిగతంగా మరియు ఆన్ లైన్ లో పాల్గొనవచ్చును. ఈ సదస్సు ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ పైన అవగాహన కలిగిస్తుంది “ నాట్ జస్ట్ ఎ హెడ్ క్ “ (కేవలం తలనొప్పి కాదు) అనే అంశాన్ని ప్రచారం చేస్తుంది.
ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ అనేది మెదడు పరిసరాలలో ఒక రకమైన ద్రవ పదార్ధం అధికంగా పెరగటం వలన తలలో ఒత్తిడి పెరగటం ద్వారా సంభవించే ఒక రకమైన వ్యాధి. ఈ పరిస్థితి సంభవించుటకు సరియైన కారణాలు తెలియక పోవటం వలననే దీనిని “ ఇడియోపతిక్ “ అంటారు. దీని వలన ప్రధానంగా తలనొప్పి రావటం మరియు దృషి లోపాలు సంభవించటం జరుగుతుంది. తలనొప్పి సాధారణమైనప్పటికి ఇది కొందరిలో తీవ్రంగా ఉంటుంది అంతేకాక దృష్టి స్పష్టంగా లేకపోవటం, ఒకటి రెండుగా కనిపించటం, చెవి లోపాల హోరుమనే శబ్దాలు వినిపించటం ఈ వ్యాధి లక్షణాలుగా పరిగణిస్తారు. ఈ వ్యాధి మహిళలలో అందునా బరువు/ఊబకాయం ఉన్న మహిళలో/యువతలో ఎక్కువగా కనిపిస్తుంది.
ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ (IIH) వ్యాధికి తక్షణం చికిత్స అవసరం. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా ఉండటం వలన త్వరితంగా గుర్తించలేము. ఈ వ్యాధిని అశ్రద్ధ చేస్తే తీవ్రమైన పరిమాణాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ జూమ్ సదస్సు ప్రజలను మరియు ఆరోగ్య సంరక్షణ నిపుణులకు మంచి అవగాహన కల్పిస్తుందని, ప్రజలలో వ్యాధి లక్షణాలు పట్ల అవగాహనను వేగవంతం చేస్తుందని మరియు తీవ్రమైన సమస్యలను నివారిస్తుందని సదస్సు నిర్వాహకులు ఈ సందర్భంగా వివరించారు.

ఇడియోపతిక్ ఇంట్రాక్రానియల్ హైపర్ టెన్షన్ వ్యాధి లక్షణాలు అతి సాధారణంగా కనిపించి నప్పటికీ వాటి తీవ్రమైన మార్పులను సకాలం గుర్తించి సరియైన చికిత్స అందించటం చాల ముఖ్యమని, లేకుంటే దృష్టి లోపం తోపాటు, ఒకోసారి అంధత్వం కూడ సంభవించవచ్చునని వారు తెలిపారు. అందువలననే ఈ వ్యాధి పట్ల ప్రజలకు వృత్తిపరమైన అవగాహన పెంపొందించుటకు, రోగ నిర్ధారణ పట్ల ఆలస్యాలను నివారించుటకు మరియు ముందస్తు చికిత్సలను ప్రోత్సహించుట ద్వారా తీవ్ర పరిణామాలను తగ్గించుటకు LV ప్రసాద్ నేత్ర వైద్యశాల వారు ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు సంప్రదించండి : 9989130882 & 8099512020

Use Social Media to Spread the Word about Our News

related articles