ఇది ఆపరేషన్ లంగ్స్ కాదు.. ఆపరేషన్ స్టమక్

by vvwnews.com

పేదల బడ్డీలు తొలగింపు పై వాసుపల్లి ఆగ్రహం..

* ఇది ఆపరేషన్ లంగ్స్ కాదు.. ఆపరేషన్ స్టమక్

పేదల పొట్ట కొట్టడమేనా.. కూటమి ప్రభుత్వ అభివృద్ధి?

సంక్షేమం ఇవ్వలేరు.. అభివృద్ధి చేతకాదు!

* పేదలకు న్యాయం చేయాలంటూ దక్షిణ వైసిపి ధర్నా..

విశాఖ నగరంలో చిరు వ్యాపారుల కడుపు కొడుతూ జీవీఎంసీ చేపట్టిన తోపుడు బండ్లు, బడ్డీలు తొలగింపు పై దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవీఎంసీ ప్రాంతంలో దక్షిణ వైసీపీ శ్రేణులతో కలిసి సోమవారం ఆపరేషన్ స్టమక్ పేరుతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ జీవీఎంసీ అధికారులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గమన్నారు. నమ్మి ఓటు వేసి గెలిపించినందుకు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పేదల కడుపు కొడుతున్నారని మండిపడ్డారు. పరిపాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలన్నారు. ఎన్నికల ముందు ప్రశ్నిస్తామంటూ ప్రసంగాలతో ఊగిపోయిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి పొంది సినిమాలకు మొగ్గు చూపిస్తున్నాడని వాసుపల్లి ఎద్దేవా చేశారు. 40 ఏళ్ల రాజకీయ ఇండస్ట్రీ అబద్దాల చంద్రబాబు ముందు నుండి పేదలు అట్టడుగు కులాలు వారు అంటే చిన్న చూపేనని వాసుపల్లి అన్నారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పేదల పొట్ట కొట్టే బడ్డీలు తొలగింపులు ఆపకపోతే వారికి అండగా వైసిపి పోరాటం చేయడానికి సిద్ధమని వాసుపల్లి తెలిపారు.
స్టేట్ క్రిస్టియన్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ బోలవరపు జాన్ వెస్లీ, స్టేట్ అధికార ప్రతినిధి కొండ రాజీవ్ గాంధీ,వైస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి రామానంద్,జిల్లా సెకరెటరీ పద్మనాభ అమ్మాజీ, అభిరెడ్డి అడివిషు రెడ్డి ,స్టేట్ RTI సెక్రటరీ దశమంతుల చిన్ని,స్టేట్ మేధావిలా విభాగం సెక్రటరీ ఇతలపాక విజయ్,స్టేట్ సంస్కృత విభాగం సెక్రటరీ సాగర్, స్టేట్ మహిళా విభాగం జాయింట్ సెక్రెటరీ బోర విజయలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి,జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్, RTI అధ్యక్షులు వద్దది దిలీప్, మాజీ కార్పొరేటర్ పచ్చిపెల్లి రాము ,27వ వార్డ్ అధ్యక్షులు సర్వేశ్వర రెడ్డి,29 వ వార్డ్ అధ్యక్షులు పీతల వాసు,30 వ వార్డ్ అధ్యక్షులు దశమంతుల మాణిక్యాల రావు,32 వ వార్డ్ అధ్యక్షులు రాజారెడ్డి, 33వ వార్డ్ అధ్యక్షులు ముత్తబాటుల రమేష్, 34 వార్డ్ లింగం శ్రీను, 35 వ వార్డ్ అధ్యక్షులు అలుపన కనక రెడ్డి,36 వార్డ్ మహమ్మద్ సకీల్, 37వ వార్డ్ ఇంచార్జి గంగళ రామరాజు,38వి వార్డ్ అధ్యక్షులు గురజాపు రవి,39వ వార్డ్ అధ్యక్షులు ముజుబ్ ఖాన్, జిల్లా ఎస్సీ సెల్ వైస్ ప్రెసిడెంట్ కోనశంకర్, జిల్లా RTI సెక్రటరీ అరుగుల రాజు,జిల్లా స్టూడెంట్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గరికిన వెంకటేష్ ,జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్ర మౌళి,జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గుంటు ఆనంద్, సౌత్ క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షులు సువర్త రాజు ( బుజ్జి ), సౌత్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు వీటి కిష్టకుమార్,సౌత్ పబ్లిసిటీ వింగ్ అధ్యక్షులు జీరు సూర్యనారాయణ (సుధా), సౌత్ బీసీ సెల్ అధ్యక్షులు బొండాడ వెంకటరమణ, సౌత్ మహిళా అధ్యక్షులు వాసుపల్లి బంగాయమ్మ, సౌత్ యూత్ వింగ్ అధ్యక్షులు తాడి రవితేజ, పబ్లిసిటీ వింగ్ ప్రెసిడెంట్ మల్ల విజయ్, సంస్కృత విభాగం అధ్యక్షులు సూర్య నాయుడు, సౌత్ మైనార్టీ సెల్ అధ్యక్షులు బాబ్జి , సౌత్ సోషల్ మీడియా అధ్యక్షులు బేవార మహేష్, సౌత్ వాలంటరీ విభాగం ప్రెసిడెంట్ నాగమణి,సౌత్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకుల శ్యామ్, జిల్లా బీసీ సెల్ మెంబెర్ కంచి బోయిన కిషోర్, జిల్లా మహిళా విభాగం సెకండియర్ రామలక్ష్మి, సైలాడ భాను,వైస్సార్సీపీ సీనియర్ నాయకులు కోరాడ సురేష్, చోడిపిళ్లి శివ,బుడ్డి, చేపల ప్రసాద్,సతీష్, రూప,రాము,హేమ, కొణతాల కృష్ణవేణి,రోజా,రమణి, పడాల సూర్య ,మాణిక్యం శ్రీను,లండ త్రినాధ్ తదితరులు పాల్గొన్నారు.

Use Social Media to Spread the Word about Our News

related articles