డాక్ యార్డ్ ఉద్యోగులు సేవలు ప్రశంసనీయం* ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్*

by vvwnews.com

*విద్యా ప్రోత్సాహకాలు స్ఫూర్తిదాయకం*

*ఉన్నత విద్యాభ్యాసంతో అపార ఉపాధి అవకాశాలు*

*డాక్ యార్డ్ ఉద్యోగులు సేవలు ప్రశంసనీయం*

*ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్*

ఎన్ఏడి జంక్షన్ సెప్టెంబరు 21
ప్రస్తుత సమాజంలో
ఉన్నత విద్యాభ్యాసంతోనే విద్యార్థులకు అపారమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని ఇండియన్ క్రికెటర్ కోన శ్రీకర్ భరత్ అన్నారు. ఆదివారం ఎన్ఏడి జంక్షన్, కాకానినగర్ కేటిబి కళాక్షేత్రంలో విద్య , క్రీడల్లో రాణిస్తున్న సుమారు 35 మంది విద్యార్థులకు క్రికెటర్ భరత్ చేతుల మీదుగా విద్యా ప్రోత్సాహకాలను అందజేశారు. ప్రశంస పత్రం.. నగదు.. జ్ఞాపకాలు విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన భరత్ మాట్లాడుతూ విద్యార్థులు తాము కోరుకున్న రంగంలో రాణించేందుకు తల్లిదండ్రులు సంపూర్ణ సహకారం
అందించాలన్నారు.. ఇప్పుడు క్రీడల ద్వారా కూడా అనేకమందికి ఎన్నో అవకాశాలు లభిస్తున్నట్లు భరత్ చెప్పారు. రక్షణ రంగంలో సేవలు అందిస్తున్న డాక్ యార్డ్ ఉద్యోగులు
ఒకవైపు దేశ రక్షణలో సేవలు అందిస్తూనే, మరోవైపు సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. తన తండ్రి కూడా డాక్ యార్డ్ ఉద్యోగి అని, ఆయన సంపాదనతోనే తాను అంచలంచలుగా క్రికెట్ లో ఎదుగుతూ వచ్చానన్నారు. అందరు ఆశీస్సులతో భవిష్యత్తులో క్రికెట్ లో మరింతగా ఎదగాలని కోరుకుంటున్నట్లు ఆయన తన ఆకాంక్షను వ్యక్తం చేశారు .కార్యక్రమానికి గౌరవ అతిథిగా హాజరైన ప్రముఖ వైద్యులు..న్యూరాలజిస్ట్ ఇందాల వెంకట రాజేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి తమ వంతు చేయూతను అందించాలన్నారు. అప్పుడే పేదరికం తగ్గుతుందన్నారు. విద్యా ప్రోత్సహకాలు పిల్లలకు మరింత స్ఫూర్తిని పెంపొందిస్తాయన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్ యార్డ్ కేటీబి అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గత
కొన్నేళ్లుగా అయ్యా రంగాల్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు విద్య.. క్రీడా ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు చెప్పారు.. ఈసారి కూడా నీట్.. ఇంజనీరింగ్ తో పాటు పలు తరగతుల విద్యార్థులకు ఈ ప్రోత్సాహకులు అందించామన్నారు.
అనంతరం క్రికెటర్ భరత్, ప్రముఖ వైద్యులు రాజేష్, సంఘం గౌరవ అధ్యక్షులు గంట శ్రీనుబాబు జబర్దస్త్ ఫేమ్ అప్పారావు తదితరులను కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో డాక్ యార్డ్ కే.టిబి అసోసియేషన్ అధ్యక్షులు బత్తుల చిరంజీవి ,కార్యదర్శి విజనగరి భాస్కరరావు లు మాట్లాడుతూ అసోసియేషన్ నిర్వహించిన అనేక కార్యక్రమాలను వివరించారు.. ఈ కార్యక్రమంలో పలువురు కార్యవర్గ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు ,,ఉద్యోగులు పాల్గొన్నారు,

Use Social Media to Spread the Word about Our News

related articles