*విశాఖపట్నంలో ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ ప్రారంభించిన హీరోయిన్ సంయుక్త మీనన్*
విశాఖపట్నం:
ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ ‘కలర్స్ హెల్త్ కేర్’ సంస్థ విశాఖపట్నంలో తన నూతన బ్రాంచ్‌ను ప్రారంభించింది. రామ్‌నగర్‌లో ఏర్పాటు చేసిన ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను హీరోయిన్ సంయుక్త మీనన్ ఆవిష్కరించారు. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన సౌకర్యాలను ఆమె పరిశీలించి, నిర్వాహకుల ప్రయత్నాలను అభినందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ “ఆకర్షణీయ నగరం విశాఖపట్నంలోని ప్రజలకు అందం, ఆరోగ్యం అందించేందుకు ‘కలర్స్ హెల్త్ కేర్ 2.O’ను తన ద్వారా పరిచయం చేయడం గర్వకారణంగా ఉందన్నారు.
నాణ్యమైన సేవలను ఆధునిక టెక్నాలజీతో అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్‌కు అభినందనలు. దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న కలర్స్ హెల్త్ కేర్.. ఇప్పుడు విశాఖ ప్రజల చెంతకు రావడం ఆనందంగా ఉంది” అని అన్నారు. విశాఖ అంటే తనకెంతో అభిమానమన్నారు. గతం లో ఇక్కడ షూటింగ్ లు చేశామని గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యం ఉంటేనే ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించగలమన్నారు. ఆరోగ్యము ఉంటేనే అన్ని సాధ్యమవుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంపై తగినంత శ్రద్ధ వహించాలని సూచించారు.
కలర్స్ హెల్త్ కేర్’ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట శివాజీ కూన మాట్లాడుతూ “2004లో ప్రారంభమైన కలర్స్ హెల్త్ కేర్ ఇప్పటివరకు వేలాది మంది కస్టమర్లను సేవలందించింది అన్నారు. దేశవ్యాప్తంగా విస్తరణలో భాగంగా విశాఖపట్నంలో బ్రాంచ్‌ను ప్రారంభించాము. ఆధునిక టెక్నాలజీని నిరంతరం జోడిస్తూ సేవలను మరింత బలోపేతం చేస్తున్నాం” అని తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికీ 55 బ్రాంచీలతో విజయవంతంగా నడుస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడున్న బ్రాంచీలను వచ్చే ఏడాది నాటికి 25 బ్రాంచ్ లు ఏర్పాటు చేయనున్నమని చెప్పారు.
ఆపరేషన్స్ డైరెక్టర్, జనరల్ మేనేజర్ కృష్ణరాజ్ మాట్లాడుతూ 21 ఏళ్లుగా కస్టమర్ల విశ్వాసం, సంతృప్తి మాకు మరింతా కాన్ఫిడెన్స్ పెంచిందన్నారు. వారి అభిలాష మేరకు విశాఖలో ఈ కొత్త బ్రాంచ్‌ను ఏర్పాటు చేశాం అన్నారు. యుఎస్ ఎఫ్డీఏ ఆమోదం పొందిన టెక్నాలజీతో అధిక బరువు, హెయిర్, స్కిన్ సమస్యలకు అంతర్జాతీయ ప్రమాణాల చికిత్సలను అందిస్తున్నాం” అని వివరించారు.
కలర్స్ హెల్త్ కేర్ కొత్త బ్రాంచ్ ప్రారంభోత్సవ
కార్యక్రమంలో హీరోయిన్ సంయుక్త మీనన్‌ను చూడటానికి అభిమానులు, అతిథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.