CARE HOSPITALS
ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి పూర్తి రోబోటిక్ ప్యాంక్రియాటిక్ సర్జరీని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్
విశాఖపట్నం, సెప్టెంబర్ 12, 2025: వైద్యరంగంలో మరో మైలురాయి విజయాన్ని సాధిస్తూ విశాఖపట్నంలోని హాస్పిటల్స్ సర్దక్షు రాష్ట్రంలోనే తొలిసారిగా పూర్తి రోబోటిక్ విప్సల్స్ ప్యాంక్రియాటికోడ్యూడు నెమ్ (ప్యాంక్రియాటిక్) శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. అత్యంత క్లిష్టమైన ఈ శస్త్రచికిత్సను సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ రోబోటిక్ సర్జరీ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ దిశ్వలను బాస్ ఆధ్వర్యంలో, అత్యాధునిక డావిన్సీ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్ సహాయంలో వైద్య బృందం చేపట్టింది.
ఈ శస్త్రచికిత్సలు శేషగిరి రావు (65) శ్రీమతి కె. శుభమణి (52)పై నిర్వహించబడ్డాయి. వీరిద్దరికి సిరియా పుల్లరి కణితులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. రోగులు కామెర్లు, కడుపునొప్పి, బరువు తగ్గడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇవి ప్యాంక్రియాస్ ప్రాంతంలో కణితులు ఉన్నప్పుడు కనిపించే సాధారణ లక్షణాలు
ప్యాంక్రియాస్ యొక్క సున్నితమైన నిర్మాణం, దానికి ఉండే విస్తారమైన రక్తప్రసరణ వల్ల విప్పిల్స్ శస్త్రచికిత్స (ప్యాంక్రియాటికోడ్యూడెనెక్టమీ) చాలా క్లిష్టమైన కేన్సర్ ఆపరేషన్లలో ఒకటి. సాధారణంగా ఈ ఆపరేషనికి 10-12 అంగుళాల కోత, ఎక్కువ రక్తనష్టం, అలాగే చాలా రోజులపాటు ఆసుపత్రిలో ఉండాల్సి వస్తుంది. అయితే కేర్ హాస్పిటల్స్లో రోగి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, పొట్టలో ఎక్కడా పెద్ద కోత లేకుండా మొత్తం శస్త్రచికిత్సను రోబోటిక్ విధానంలో విజయవంతంగా పూర్తి చేశారు.
రోబోటిక్ పద్ధతిలో ఉన్న 360-డిగ్రీల మణికట్టు పరికరాలు, హై-డెఫినిషన్ 3డి దృశ్యం, చిన్న రక్త నాళాలను కుట్టే సాటి లేని ఖచ్చితత్వం వల్ల శస్త్రచికిత్సలు అత్యంత భద్రంగా, కచ్చితంగా పూర్తయ్యాయి సాధారణంగా ఓపెన్ సర్జరీ చేసిన తర్వాత 2-3 వారాలు పడుతుంటే, ఈ రోబోటిక్ శస్త్రచికిత్సలో ఇద్దరు రోగులు 24 గంటల్లోనే నడవగలిగారు. కేవలం 5 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యారు.
ఈ మైలురాయి గురించి డాక్టర్ బి.బి. దాస్ మాట్లాడుతూ, ‘రోబోటిక్ శస్త్రచికిత్స భవిష్యత్తు లో వచ్చేది కాదు, ఇది ఇప్పటికి మన ముందుంది అని ఈ విజయం చూపించింది. చాలా క్లిష్టమైన క్యాన్సర్లను కూడా ఇప్పుడు రోగులు ఎక్కువ భద్రత, ఖచ్చితత్వం, తక్కువ గాయం తో చికిత్స పొందవచ్చు. రోబోటిక్ ఎప్సిల్ శస్త్రచికిత్సలు ప్రపంచవ్యాప్తంగా కొద్ది కేంద్రాలలో మాత్రమే జరుగుతాయి. అలాంటి అధునాతన వైద్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రోగులకు అందించడం మాకు గర్వకారణం” అన్నారు.
శస్త్రచికిత్స తర్వాత ఇద్దరు రోగులు పూర్తిగా కోలుకుని, వ్యాధి లేకుండా తమ సాధారణ జీవితాల్లోకి అడుగుపెట్టారు. తన అనుభవాన్ని పంచుకుంటూ శేషగిరి రావు మాట్లాడుతూ, నా క్లోమంలో శస్త్రచికిత్స చేయాల్సి వస్తుందని తెలిసినప్పుడు చాలా భయపడ్డాను. కానీ ఆశ్చర్యంగా, నాకు పెద్ద మచ్చ ఏదీ రాలేదు. మరుసటి రోజే నడవగలిగాను. ఇప్పుడు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. డాక్టర్ దాస్ గారికి, కేర్ హాస్పిటల్స్ బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు” అని చెప్పారు.
విశాఖపట్నంలోని కేర్హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మయూబ్ చౌదురి చెప్పారు, కేర్హాస్పిటల్స్లో, ఈ ప్రాంతంలోని రోగులకు ప్రపంచ స్థాయి క్యాన్సర్ ట్రీట్మెంట్ అందించడం మా ప్రధాన లక్ష్యం. రోబోటిక్ విప్పిల్ శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయ్యిన తర్వాత, మేము అధునాతన క్యాన్సర్ చికిత్సలో కొత్త ప్రమాణాన్ని