సూత్రా వస్త్ర ప్రదర్శన ఈరోజు ముగుస్తుంది
విశాఖపట్నం 7 సెప్టెంబర్ 2025 : సంప్రదాయత నుండి ఆధునిక ఫ్యాషన్ దుస్తులు వరకు విభిన్న వస్త్ర సంపదను ఒకేచోట అందించే ఇండియన్ ఫ్యాషన్ ఎగిజిబిషన్ – సూత్రా నగరంలోని ఆర్కే బీచ్ నోవాటెల్ హోటల్ నందు గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్న ప్రదర్శన నేటితో (8/9/2025) ముగుస్తున్నాది. వస్త్ర ప్రియులు ఈ చివరి అవకాశం వినియోగించు కోవలసినదిగా నిర్వాహకులు కోరుచున్నారు. రాబోయే దసరా మరియు దీపావళి పండుగలకు అద్భుతమైన దుస్తులను కొనుగోలు చేసి పండుగలను అత్యంత సంతోషభరితంగా జరుపుకునే సదవకాశం ఈ ప్రదర్శన అందిస్తుంది అన్నారు.
దేశం నలుమూలలు నుండి తెచ్చిన అద్వితీయమైన వస్త్రాలు మరియు ఆభరణాలు ఈ పండుగ సీజన్ ను మరింత శోభాయమానం చేస్తాయి అంటున్నారు. ఈ గ్రాండ్ ఎగ్జిబిషన్ ను సందర్శించి మీ జీవన శైలికి అనుగుణమైన వస్త్రాలను మరియు ఆభరణాలను కొనుగోలుచేయవలసినదిగా పండుగలు మరియు వేడుకలను వైభవంగా జరుపుకోవలసినదిగా నిర్వాహకులు కోరుచున్నారు.
ఈ అద్భుతమైన ప్రదర్శనలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన పేరొందిన వస్త్రాలు, సిల్వర్ జ్యుయలరీ, ప్రముఖ సంస్థల ఉపకరణాలు, అలంకరణ సామగ్రి, క్లాతింగ్ ప్యాలేట్, ఆడా క్రియేషన్స్, లడక్ సిల్క్ శారీస్, ఇంకా ఎన్నెన్నో విస్తృత శ్రేణిలో ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ చివరి అవకాశం అందరు వినియోగించుకోవలసినదిగా సూచించారు. ఈ ప్రదర్శన ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటలు వరకు సందర్శకులకు తెరచి ఉంటుంది. ప్రవేశం ఉచితం. కుటుంబ సమేతంగా రండి ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగు పెట్టండి.
వివరాలకు : 99035 18813
SUTRA LAST DAY PRESS NOTE